ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్ అవార్డ్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ అవార్డ్ కోసం పోటీ పడుతుంది. అంతేకాదు.. ఇటీవలే అమెరికాలోని కాలిఫోర్నియా వేదికగా హాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ అవార్డ్స్ అందుకుంది ఈ సినిమా.
మార్చి 12న జరగబోతున్న 95వ ఆకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో RRR మన ఇండియా తరపున నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్స్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఫైనల్‌కి చేరుకుంది. ఇప్పుడు అవార్డ్ దక్కించుకోవాలని అందరూ బలంగా కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేఫద్యంలో ఈ మూవీ నుంచి ఆస్కార్స్‌కు ఎంపికైన నాటు నాటు పాటకు ప్రపంచమంతా ఆడిపాడుతోంది. సెలబ్రిటీలు సైతం ఈ పాటకు కాలు కదుపుతుండటం విశేషం.ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న ఈ పాట.. ఇప్పుడు ఆస్కార్ కోసం నామినేట్ అయ్యింది. విదేశాల్లోనూ సినీ ప్రియులు ఈ పాటకు స్టెప్పులేశారు. తాజాగా కొరియన్స్ నాటు నాటు పాటకు అందంగా డాన్స్ చేశారు. తాజాగా ఈ లిస్టులో కొరియన్ రాయబారి చేశారు.
కొరియాలోని ఇండియన్ సిబ్బందితో కలిసి కొరియన్ రాయబారి చాంగ్ జె.బోక్ చిందులేశారు. ఆ వీడియోను కొరియా ఇండియన్ ఎంబసీ తమ అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేసింది. దాన్ని మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ రీ ట్వీట్ చేశారు. ‘టీమ్ ఎఫర్ట్ గొప్పగా, లైవ్‌లీగా ఉంది’ అంటూ ఆయన సదరు వీడియోపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇప్పుడు నరేంద్ర మోదీ రీ ట్వీట్ చేసిన ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్ అవార్డ్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ అవార్డ్ కోసం పోటీ పడుతుంది. అంతేకాదు.. ఇటీవలే అమెరికాలోని కాలిఫోర్నియా వేదికగా హాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ అవార్డ్స్ అందుకుంది ఈ సినిమా.
దీనితో ఆస్కార్ కి దగ్గరవుతున్న వేళ మోడీ నుంచి కూడా నాటు నాటు కి రెస్పాన్స్ రావడం మరింత ఆసక్తర వాతావరణం నెలకొల్పుతుంది అంటున్నారు. ఈ సెన్సేషనల్ ట్రాక్ ని ఎం ఎం కీరవాణి కంపోజ్ చేయగా చంద్రబోస్ సాహిత్యం అందించారు. అలాగే ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి..మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. గత ఐదు రోజులుగా అమెరికా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. అలాగే.. కాలిఫోర్నియా వేదికగా జరిగిన హెచ్ సీఏ అవార్డులను అందుకున్న సంగతి తెలిసిందే.
