ఖద్దరు కుర్తా వేసిన ఎన్టీఆర్.. 'అరవింద సమేత' సెట్స్ నుండి లీక్!

Photo leaked from sets of Jr NTR's 'Aravindha Sametha' goes viral
Highlights

తెలుపు రంగు ఖద్దరు కుర్తా, బ్లూ జీన్స్ వేసుకొని ఎన్టీఆర్ నడుస్తూ వస్తోన్న స్టిల్ ను ఎవరో ఔత్సాహికులు ఫోటో తీసి సోషల్ మీడియాలో ఉంచారు. ఇది ఎన్టీఆర్ సీమ లుక్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి

ఒకప్పుడు పెద్ద హీరోల సినిమా విడుదలవుతుందంటే అందులో హీరో ఎలా ఉంటాడో చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉండేది. షూటింగ్ పూర్తయ్యే వరకు కూడా ఒక్క ఫోటో కూడా బయటకు లీక్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. స్టార్ హీరోల సినిమాలకు లీకుల బెడద ఎక్కువైంది. చిత్రబృందం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. షూటింగ్ సమయంలో ఫోటోలు లీక్ అవుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ నటిస్తోన్న 'అరవింద సమేత' సినిమా నుండి మొన్నామధ్య ఓ ఫోటో లీక్ అయింది.

దీంతో అప్రమత్తమైన దర్శకుడు త్రివిక్రమ్ షూటింగ్ స్పాట్ కు మొబైల్ ఫోన్లు, ట్యాబ్ లు తీసుకురావడం పట్ల ఆంక్షలు విధించారు. త్రివిక్రమ్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. లీకులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈ సినిమా సెట్ నుండి మరో లుక్ లీక్ అయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు గెటప్స్ లో కనిపించబోతున్నారు. ఒకటి కాలేజ్ స్టూడెంట్ లుక్ కాగా మరొకటి రాయలసీమ బ్యాక్ డ్రాప్ కు చెందిన గెటప్. ఇప్పటికే స్టూడెంట్ రోల్ లో ఎలా ఉండబోతున్నాడనే క్లారిటీ చిత్రబృందం ఇచ్చేసింది.

ఇప్పుడు మరో కొత్త గెటప్ లో ఎన్టీఆర్ లుక్ ఆన్ లైన్ లో ప్రత్యక్షమైంది. తెలుపు రంగు ఖద్దరు కుర్తా, బ్లూ జీన్స్ వేసుకొని ఎన్టీఆర్ నడుస్తూ వస్తోన్న స్టిల్ ను ఎవరో ఔత్సాహికులు ఫోటో తీసి సోషల్ మీడియాలో ఉంచారు. ఇది ఎన్టీఆర్ సీమ లుక్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయనున్నారు. 

loader