ఆ ప్రొడ్యూసర్ తో 'RX 100' హీరోయిన్!

payal rajputh to work with top producer
Highlights

తాజాగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఆమెతో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. అతడు నిర్మిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా నటించమని ఆమెను సంప్రదించగా పాయల్ అంగీకరించినట్లు తెలుస్తోంది

'RX 100' చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది నటి పాయల్ రాజ్ పుత్. పంజాబీకి చెందిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో ఒకట్రెండు సినిమాల్లో నటించింది. అలానే సీరియల్ ఆర్టిస్ట్ గా చాలా బిజీ. ఈ క్రమంలో ఆమె టాలీవుడ్ లో RX 100' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో పాయల్ కు ఎనలేని గుర్తింపు లభించింది. సినిమాలో ఆమె బోల్డ్ పెర్ఫార్మన్స్ కి యూత్ మొత్తం ఫిదా అయిపోయింది.

సినిమా సక్సెస్ క్రెడిట్ ఆమెకే దక్కుతుంది. ఈ సినిమా తరువాత ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. తాజాగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఆమెతో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. అతడు నిర్మిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా నటించమని ఆమెను సంప్రదించగా పాయల్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమెకు అడ్వాన్స్ కూడా అందించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పాయల్ సరేనా ఓ యంగ్ హీరో కనిపించే అవకాశాలు ఉన్నాయి. అయితే సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది..? డైరెక్టర్ ఎవరనే..? విషయాలు తెలియాల్సివున్నాయి! 

loader