ఆ సినిమాలో నన్ను బాగా వాడేశారు.. హీరోయిన్ కామెంట్స్!

payal rajputh bold comments on rx100 movie
Highlights

సినిమాలో నటించింనందుకు తను తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం రూ.6 లక్షల రూపాయలు మాత్రమేనని, దర్శకుడు అజయ్ భూపతి తనను సినిమాలో బాగా వాడేశాడని చెప్పింది. అయితే దానికి తను బాధ పాడడం లేదని సినిమా మంచి సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉందంటోంది పాయల్

'RX100' సినిమాతో తెలుగు వారికి పరిచయమైన నటి పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే యూత్ అందరికీ దగ్గరైంది. ఈ సినిమాలో అమ్మడు ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది. సినిమా సక్సెస్ క్రెడిట్ లో ఎక్కువ శాతం ఆమెకే దక్కుతుంది. సినిమాలో హీరో, హీరోయిన్లకు మధ్య దాదాపు 45 కి పైగా కిస్ సీన్స్, హగ్ సీన్స్ ఉన్నాయి. ఇక హీరోయిన్ గా పాయల్ చేసిన ఎక్స్ పోజింగ్ కి హద్దే లేదు.

ఈ అంశాలు యూత్ ని ఎట్రాక్ట్ చేయడంతో సినిమా మంచి విజయ్ సాధించి కలెక్షన్స్ కూడా బాగా వసూలు చేసింది. కానీ దీనివల్ల పాయల్ కు క్రేజ్ వచ్చినా.. అదే రేంజ్ లో విమర్శలు కూడా వచ్చాయి. ఇది సినిమా కాదని, మొత్తం బూతులు ఉన్నాయంటూ మహిళా సంఘాలన్నీ విరుచుకుపడ్డాయి. అయితే తను సినిమాలో ఆ విధంగా నటించడానికి కారణం సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికే అని చెబుతోంది పాయల్.

సినిమాలో నటించింనందుకు తను తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం రూ.6 లక్షల రూపాయలు మాత్రమేనని, దర్శకుడు అజయ్ భూపతి తనను సినిమాలో బాగా వాడేశాడని చెప్పింది. అయితే దానికి తను బాధ పాడడం లేదని సినిమా మంచి సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉందంటోంది పాయల్. ఇకపై మాత్రం తను రెమ్యునరేషన్ పెంచుతున్నట్లు ప్రకటించింది. టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనుందని వెల్లడించింది.   

loader