5 నిమిషాలకు 5 లక్షలు.. 'RX100' హీరోయిన్ డిమాండ్!

payal rajput demands 5 lakhs for 5 minutes
Highlights

గ్లామర్ షో విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోలేని పాయల్ ను తమ సినిమాల్లో హీరోయిన్ గా ఎంపిక చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే ఆమె ఓ సినిమా కూడా సైన్ చేసిందని సమాచారం. దానికి భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట

సినిమా ఇండస్ట్రీలో తారలు తమకున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంటారు. మొహమాటాలకు పోయి పారితోషికం తగ్గించడాలు వంటివి అసలు చేయరు. తమకు క్రేజ్ ఉన్నంతవరకు సంపాదించుకొని సెటిల్ అవ్వాలనే చూస్తారు. దీనికి అతీతం కాదు 'RX100' హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.

బాలీవుడ్ కు చెందిన పాయల్ తన ఎక్స్ పోజింగ్ తో యూత్ ని మొత్తం తనవైపు తిప్పుకుంది. గ్లామర్ షో విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోలేని పాయల్ ను తమ సినిమాల్లో హీరోయిన్ గా ఎంపిక చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే ఆమె ఓ సినిమా కూడా సైన్ చేసిందని సమాచారం. దానికి భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.

ఇక తాజాగా ఓ ఛానెల్ నిర్వహించిన అవార్డు ఫంక్షన్ లో 5 నిమిషాలు స్టేజ్ పై కనిపించడానికి అమ్మడు ఎంత పారితోషికం తీసుకుందో తెలుసా..? అక్షరాలా రూ.5 లక్షలు. ఇది తను 'RX100' సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ తో సమానం. పింక్ కలర్ కోల్డ్ షోల్డర్ డ్రెస్ వేసుకొని సింపుల్ లుక్ తో అవార్డు వేడుకలో అందరినీ ఆకట్టుకుంటుంది. 

loader