లిప్ లాక్ సీన్స్ చేయడం తప్పనిపించలేదు.. ప్రభాస్ తో కూడా నటిస్తా

payal raj puth about lip lock scenes in rx100 movie
Highlights

పాయల్.. స్క్రిప్ట్ కోసమే పలు రొమాంటిక్ లిప్ లాక్ సీన్స్ లో నటించినట్లు వెల్లడించింది. అలా చేయడం తనకు తప్పనిపించాలేదని.. నటిగా చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ కామన్ అని స్పష్టం చేసింది

పలు టీవీ సీరియళ్లలో నటించిన పాయల్ రాజ్ పుత్ గతంలో ఓ పంజాబీ సినిమాలో లీడ్ రోల్ లో నటించింది.ఇప్పుడు 'RX100' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా అనిపించడంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన అజయ్ భూపతి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో పాయల్ రాజ్ పుత్ మీడియాతో ముచ్చటించింది.

తెలుగులో మొదటి సినిమా కావడంతో భాష విషయంలో బయపడినట్లు.. యూనిట్ సభ్యుల సహకారంతో షూటింగ్ పూర్తి చేశానని చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమా ట్రైలర్ లో లిప్ లాక్ సీన్స్ కు కొదవే లేదు. ట్రైలర్ లోనే ఇలా ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందనే విమర్శలు వినిపించాయి. దీనిపై స్పందించిన పాయల్.. స్క్రిప్ట్ కోసమే పలు రొమాంటిక్ లిప్ లాక్ సీన్స్ లో నటించినట్లు వెల్లడించింది. అలా చేయడం తనకు తప్పనిపించాలేదని.. నటిగా చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ కామన్ అని స్పష్టం చేసింది. ఇక ఆ సన్నివేశాలు స్క్రిప్ట్ లో భాగంగా ఉంటాయని కావాలని ఇరికించినవి కాదని చెప్పుకొచ్చింది.

తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు నటించిన సినిమాలు చూశానని, బాహుబలి ప్రభాస్ అంటే చాలా ఇష్టమని చెప్పిన పాయల్ ఫ్యూచర్ లో ప్రభాస్ తో కలిసి ఒక్క సినిమాలో అయినా నటిస్తాననే నమ్మకం ఉందని వెల్లడించింది.    

loader