పవన్ విగ్రహం పెట్టేసిన ఫ్యాన్స్... ఎక్కడో తెలుసా.?

Pawan Statue at thadepalligudem
Highlights

పవన్ విగ్రహం పెట్టేసిన ఫ్యాన్స్... ఎక్కడో తెలుసా.?

తమ అభిమాన సినీ హీరో లేదా రాజకీయ నేతల మీద ఫ్యాన్స్ చాలా రకాలుగా అభిమానాన్ని చాటుకొంటూ ఉంటారు. ఆ హీరోలపై పూల వర్షం కురిపించడం, ఆ హీరోల ఫ్లెక్సీలకు, కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం వంటివి జరుగడం మామూలే. ఇలా రకరకాలుగా ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకొంటూ ఉంటారు. ఈ పరంపరలో పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు కాస్త భిన్నమైన రీతితో తన అభిమానాన్ని చాటుకున్నాడు.

 పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఒక అభిమాని పవన్ కల్యాణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. జనసేనతో రాజకీయాల్లోకి వచ్చిన సినీహీరోపై ఈ విధంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు ఆ అభిమాని. ఏడున్నర అడుగుల నిలువెత్తు విగ్రహం ఏర్పాటుతో పవన్ పై అభిమానాన్ని చాటుకున్నాడు ఆ వ్యక్తి. గబ్బర్ సింగ్‌‌గా పవన్‌కు అచ్చొచ్చిన రెడ్ టవల్‌ను నడుముకు చుట్టించి, మెడలో జనసేన కండువాతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది ఈ విగ్రహం.

loader