అతడితో బ్రేకప్ అవ్వడానికి సినిమాలే కారణం!

Pawan's Heroine Reveals Her Breakup
Highlights

పవన్ హీరోయిన్ బ్రేకప్ స్టోరీ

పవన్ కళ్యాణ్ నటించిన 'కొమరం పులి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ నికిషా పటేల్ సరైన గుర్తింపును మాత్రం సంపాదించలేకపోయింది. తెలుగులో ఆమెకు అవకాశాలే దక్కలేదు. దీంతో కోలీవుడ్ కు షిఫ్ట్ అయ్యి అక్కడ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ తన బ్రేకప్ స్టోరీను చెప్పుకొచ్చింది. సినిమాల్లోకి రాకముందు తను ఓ వ్యక్తిని ప్రేమించిందంట. 

పెద్దల్ని ఒప్పించి ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నట్లు కానీ మధ్యలోనే విడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. దానికి కారణం సినిమాలని వెల్లడించారు. ఆమె ప్రేమించిన వ్యక్తికి నికిషా సినిమాల్లోకి రావడం ఇష్టం లేదట. నువ్వు సినిమాలలో నటిస్తే మన పెళ్లి విషయం మరచిపోమని చెప్పాడట. ఆ సమయంలో తనకు సినిమాల్లోకి రావడమే ప్రధాన లక్ష్యంగా ఉండేదని దీంతో ఇద్దరం స్నేహపూర్వకంగా విడిపోయినట్లు స్పష్టం చేసింది.

సినిమాల్లోకి వచ్చిన తరువాత పూర్తిగా సక్సెస్ కాలేకపోయానని అయినా ఎలాంటి బాధ లేదని ఎప్పటికైనా బిజీ అవుతాననే నమ్మకం ఉందని అన్నారు. ప్రస్తుతానికి ప్రేమ, పెళ్లి ఆలోచనలు లేనట్లు తెలిపారు. 

loader