పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  అభిమానులకు, మూవీ క్రిటిక్ కత్తి మహేష్ కి గత కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం సాగుతోంది. జన సేన పార్టీ పెట్టిన తరవాత అసలు పవన్ కళ్యాణ్ విధి విధానాలు ఏంటి ఇన్నేళ్ళ పాటు పార్టీ ని ఇంకా నిర్మించకుండా ఉండడం ఏంటి అంటూ మహేష్ కత్తి అడిగిన ప్రశ్నలకు పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 దేశం లో ఎన్నో సమస్యలు ఉండగా పవన్ కళ్యాణ్ మీద పడి ఏడవడమే పనిగా పెట్టుకున్న మహేష్ కత్తి లాంటి వారిని టార్గెట్ చేసిన పవన్ ఫాన్స్ అతనికి బెదిరింపు కాల్స్ కూడా చేసారు. చివరికి అతన్ని చంపేస్తాం అని కూడా అన్నారు.

 

దీనిపై ఈరోజు పవన్ .. ఇన్ డైరెక్ట్ గా స్పందించారు. పవన్ కళ్యాణ్ ని ద్వేషిస్తూ కూర్చోవడం అంటే అది టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఇంకేమీ కాదు అని పవన్ ఓపెన్ గా చెప్పాడు. ఎక్కడా మహేష్ కత్తి పేరు ఎత్తని పవన్ ఇలాంటివి చాలా ఊహించే రాజకీయాల్లోకి అడుగు పెట్టా అన్నారు. తనని ద్వేషించేవారి సమయం వేస్ట్ అవుతుందనే తప్ప, మరో ఆలోచన చేయనని చెప్పారు. ద్వేషమనేది ద్వేషించేవారి ఆరోగ్యాన్నే దెబ్బతీస్తుంది .. అలాంటివారి గురించి నేను పట్టించుకోను .. మీరూ అలాగే ఉండండని తన మనసులోని మాట చెప్పారు. పనవ్ ఆ మాటలన్నది మహేష్ కత్తి గురించేనని అందరూ చర్చించుకుంటున్నారు.