ఛల్ మోహన్ రంగా.. గత రెండు వారాలుగా ఈ సినిమా గురించి తెగ బజ్ పెరిగిపోయింది. కారణం ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ కో-ప్రొడ్యూస్ చేస్తూ.. త్రివిక్రమ్ సారధ్యంలో సమర్పణలో నిర్మితమైన సినిమా అంటే ఆ మాత్రం అంచనాలు ఉంటాయిగా. అదేనండీ.. లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య డైరక్షన్లో నితిన్ హీరోగా ''ఛల్ మోహన్ రంగ'' సినిమా వస్తోందిగా.. దాని గురించే ఈ హంగామా అంతా. పదండి వేలెంటైన్స్ డే సందర్భంగా రిలీజైన ఈ సినిమా టీజర్ ఎలా ఉందో చూద్దాం. 

ఇష్క్ సినిమా తరువాత నుండి నితిన్ అసలు ప్రేమకథలను టచ్ చేస్తే చాలు.. అవి బాగా వర్కవుట్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో కనిపిస్తోంది. ''మేం వర్షం కాలంలో కలసి.. శీతాకాలంలో ప్రేమించుకుని.. వేసవి కాలంలో విడిపోయాం'' అంటూ తన క్యుట్ కథను చెబుతుంటాడు నితిన్. ''అంటే మీరిద్దరూ వెదర్ రిపోర్టర్లా భయ్యా?'' అంటూ పక్కనుండి ఒక పంచ్. చూస్తుంటే ఇదో రొమాంటిక్ కామెడీ అని అర్ధమవుతోంది. అలాగే నితిన్ పక్కనే హీరోయిన్ మేఘా ఆకాష్.. వారిద్దరి కెమిస్ర్టీ.. అదిరిపోయాయ్. చూడ్డానికి ఇద్దరూ చాలా ఇంప్రెసివ్ గా ఉన్నారు. 

ఇకపోతే ఈ సినిమాకు పవన్.. త్రివిక్రమ్ వంటి పెద్ద పెద్ద పేర్లు.. నితిన్ అండ్ కృష్ణ చైతన్య వంటి టాలెంట్లు ఉన్నాక.. మరి మ్యూజిక్ ఎట్టా ఉండాలా? అందుకే తమన్ బాబు చంపేశాడు. మరోసారి తాను బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు రారాజు అని ప్రూవ్ చేసుకున్నాడు. సినిమాపై కొత్త హోప్స్ ను తెచ్చేశారు అందరూ కలసి. ఏప్రియల్ 5న విడుదలకాబోతున్న ఈ సినిమా ట్రైలర్ త్వరలోనే విడుదల కాబోతోంది.