అఙ్ఞాతవాసిలో పవన్ పేరు ఇదేనట

Pawan name in agnyathavaasi revealed
Highlights

  • హీరో పవన్ పేరు 'ఏ బీ' అనే అక్షరాలతో ఉంటుంది..
  •  సంగతి 'ఏబీ.. ఎవరో నీ బేబీ' పాట ద్వారా చెప్పేశారు. ఏంటంటే..
  • ఈ ఏబీకి అర్థం.. 'అభిషిక్త్ భార్గవ'. అజ్ఞాతవాసిలో పవన్ పేరు అదే

తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యాన్స్ అనగానే గుర్తుకొచ్చే హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుందో మనకు తెలిసిందే. ఈ క్రేజ్ నేపథ్యంలో పవన్ కొత్త  సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ హడావుడి అంతా ఇంతా వుండదు. తమ హీరో సినిమాకు సంబంధించిన ఏ చిన్న క్లూ దొరికినా సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తారు. తాజాగా పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా గురించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఏ చిన్న విషయం తెలిసినా వెంటనే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఫ్యాన్స్ని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయకుండా.. చిన్నా చితకా లీకులు ఇస్తూ.. అజ్ఞాతవాసి టీం  కూడా బాగానే ఎంటర్టెయిన్ చేస్తోంది.అజ్ఞాతవాసికి సంబంధించిన టీజర్ వచ్చేసింది.. పాటలు రిలీజ్ అయ్యాయి. సంక్రాంతి కానుకగా 10వ తేదీన రిలీజ్ కానుంది. 

 

ఇప్పటివరకూ థియేట్రికల్ ట్రైలర్ మాత్రం రాలేదు. అంతే కాదు.. అసలు హీరో పేరు ఏంటనే సంగతి కూడా తెలియకపోవడం ఆశ్చర్యకరమే. అయితే.. ఈ చిత్రంలో పవన్ పేరు 'ఏ బీ' అనే అక్షరాలతో ఉంటుందనే సంగతి 'ఏబీ.. ఎవరో నీ బేబీ' పాట ద్వారా చెప్పేశారు. మరి ఈ ఏబీకి అబ్రివేషన్ ఏంటి  అనే సంగతి ఎవరూ ఊహించలేకపోయారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఈ ఏబీకి అర్థం.. 'అభిషిక్త్ భార్గవ'. అజ్ఞాతవాసిలో పవన్ పేరు అదే.

 

సన్నిహితులు.. సహోద్యోగులు మాత్రం పవన్ ను ఏబీ అని పిలుస్తుంటారు. భార్గవ అనే వర్డ్ పాటల్లో వస్తూనే ఉంది. ఇక పవన్ పాత్రకు డిఫరెంట్ నేమ్స్ ఇవ్వడంలో తన ట్యాలెంట్ మరోసారి చూపించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. జల్సా మూవీలో సంజయ్ సాహు.. అత్తారింటికి దారేది చిత్రంలో గౌతమ్ నందా అని పేర్లు పెట్టిన మాటల మాంత్రికుడు.. ఇప్పుడు అభిషిక్త్ భార్గవగా పవర్ స్టార్ ను చూపించబోతున్నాడు. జనవరి 10న టాలీవుడ్ బిగ్గెస్ట్ రిలీజ్ గా సెన్సేషన్ కు అజ్ఞాతవాసి సిద్ధమైపోతున్నాడు.

loader