మొదటి సారి తన ఇద్దరు కొడుకులతో కనిపించి ఫ్యాన్స్ కు కనువ విందు చేశారు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్. తనయులు ఇద్దరి చేయి పట్టుకుని నడిపించుకుంటూ కనిపించారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. త‌న ఇద్ద‌రు కొడుకులతో కలిసి కనిపించారు. మొదటిసారి తన పెద్ద‌కుమారుడు అకీరా నందన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్ చేయి పట్టుకుని నడిపిస్తూ కనిపించారు. ఈ దృశ్యం చూసి ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. శుక్రవారం ఉదయం మంగళగిరిలోని తన నివాసానికి వ‌చ్చారు పవన్. అధికారులతో, పార్టీ ప్రతినిధులతో ముఖ్యమైన విషయాలపై చర్చించారు. అనంతరం వారితో కలిసి మార్కాపురం నియోజకవర్గ పర్యటనకు బయలుదేరారు.

 

జ‌లజీవన్‌ మిషన్‌ కింద రూ.1,290 కోట్లతో చేపట్టనున్న తాగునీటి పథకానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఆతరువాత బహిరంగసభలో ప్రసంగించారు. నియోజకవర్గ పర్యటనలో తన ఫ్యామిలీ కూడా పాల్గొన్నారు. ఇక పవన్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా జూలై 24న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. గురువారం విడుద‌ల చేసిన ఈ చిత్ర ట్రైల‌ర్‌కు అదిరిపోయే స్పంద‌న వచ్చింది. ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్ కేవ‌లం 24 గంట‌ల్లోనే 48 మిలియ‌న్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుని ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. ప్రత్యేకంగా తెలుగు ట్రైలర్ 48 మిలియన్ వ్యూస్ దాటడంతో అద్భుత రికార్డు సాధించింది.