పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సీఎం అంటూ నినదిస్తున్న కార్యకర్తలనుద్దేశించి ఎప్పటికి సీఎం.. అంటూ తను పార్టీ పెట్టిన ఉద్దేశ్యాన్ని వివరించారు పవన్. భావితరాల కోసం పిరికితనం, మోసం తప్ప అంటూ గుంటూరు శేశేంద్ర శర్మగారు చెప్పినట్లు.. అంటూ ప్రసంగం ప్రారంభించిన పవన్. ఆంగ్లంలో మాట్లాడుతూ... సమకాలినన రాజకీయ వ్యవస్థను చూసాక బాధతోనే పార్టీ పెట్టాను. ప్రధానికి నేను హెచ్చరిస్తున్నా... 2014లో మిమ్మల్ని సెంట్రల్ హాల్ లో కలిసాను. గత నాలుగేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ జనాన్ని మోసం చేసిన తీరు మమ్మల్ని తీవ్రంగా బాధించింది. స్పెషల్ కేటగిరీ ఇవ్వలేమని మీరు చెప్పటం ,

మరి తెలంగాణ ఇచ్చినప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ 15 ఏళ్లకు ఇస్తామని అన్నారు కదా. గతంలో ఆంధ్ర ప్రజలు ఇందిరాగాంధీ హయంలో విభజన కోరినప్పుడు సమైక్యంగా వుండాలన్నారు. ఆ ఉద్యమంలో అనేక మంది అసువులు బాసారు. మీ రాజకీయ వేత్తల వల్ల ఎంతో మంది అమరులయ్యారు.

కాకినాడ సభలో కూడా మీరు రెండు రాష్ట్రాలు ఇస్తామని చెప్పారు, ఇచ్చారు. మరి విభజన సమయంలో 15ఏళ్లు స్టేటస్ ఇస్తామన్నారు. మరి ఎందుకివ్వట్లేదు. చట్టాలు కేవలం రాజకీయ మాటలకేనా.. ప్రజల కోసం కాదా.. అంటూ నిలదీశారు.

1972లో అడిగినప్పుడు ఇవ్వలేదు. 2014లో వద్దంటే విభజించారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు.

బాబు, జగన్ లు.. కేంద్రానికి భయపడ్డారేమో. వాళ్ల సమస్యలు వాళ్లకున్నాయేమో. కానీ... నేను రాజధాని అమరావతి నుంచి మాట్లాడుతున్నా... 5 కోట్ల మంది ఆంధ్రులను పాతిక మంది ఎంపీలతో నియంత్రించాలని చూస్తున్నారు. అది సాధ్యం కాదని చెప్తున్నా.

మేము జేఎఫ్ సీ సమావేశం నిర్వహించాక.. రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని, ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం కేంద్రాన్ని నిలదీయాల్సిన అవసరం వుంది.

గౌరవ ప్రధాని గారిని నేను అడిగేది... సీబీఐ కేసులతో, ఇతర కేసులతో.. అవినీతి రాజకీయ నేతలు మీకు భయపడుతున్నారేమో. నాకు, ఆంధ్ర ప్రజలకు కేంద్రమంటే భయం లేదు. ఎందుకంటే... ఇది స్వామి వివేకానందుడు పుట్టిన గడ్డ. బుల్లెట్లతో హక్కుల కోసం పోరాడుతున్న ఆంధ్రులను అణచివేయలేరు. ఆంధ్రుల సత్తా ఏంటో అమరావతి సాక్షిగా చూపిస్తాం.