ఫ్వామిలీతో విదేశాల్లో వెకేషన్.. తండ్రిని మించిన యంగ్ పవర్ స్టార్ అకీరా

pawan kalyan vacation with family in bulgaria while shooting trivikram film
Highlights

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కోసం బల్గేరియాలో పవన్
  • ఈసారి పవన్ తో అతని భార్య లెజినోవాతోపాటు కుమారుడు అకీరా, కూతుళ్లు ఆద్య, పొలెనా
  • కుటుంబ సభ్యులను కూడా తీసుకెళ్ళి వెకేషన్, షూటింగ్ రెండు పనులు పూర్తి చేసిన పవన్
  • ఎయిర్ పోర్ట్ లో క్లిక్ మన్న ఫోటోల్లో అకీరా నందన్ పొడవు గురించి సోషల్ మీడియాలో  హంగామా

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు సంబంధించి ఏ విషయం బయటకు వచ్చినా అభిమానులు ఆసక్తిగా గమనిస్తుంటారు. ఆయన సినిమా జర్నీ మాత్రమే కాదు, పొలిటికల్ జర్నీ, పర్సనల్ జర్నీ ఇలా అన్ని విషయాల్లోనూ తనదైన ముద్ర వేశారు పవన్ కళ్యాణ్. సాధారణంగా పవన్ కళ్యాణ్ విదేశాల్లో జరిగే తన సినిమా షూటింగులకు భార్య పిల్లలను తీసుకుని రావడం చాలా అరుదు. అయితే ఈ సారి ఆయన తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని బల్గేరియా వెళ్లడం హాట్ టాపిక్ అయింది.

 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి పాటల షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది. షూటింగుతో పాటు ఫ్యామిలీ వెకేషన్ కూడా ప్లాన్ చేశాడు పవర్ స్టార్. ముగ్గురు పిల్లలతో పవన్ కళ్యాణ్ వెంట ఆయన భార్య అన్నా లెజెనివా, కూతురు పోలెనాతో పాటు అకీరా నందన్, ఆద్యా కూడా ఉండటం గమనార్హం. ఈ ఫోటోలు ఇపుడు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.

 

పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ వయసు 14 సంవత్సరాలు మాత్రమే. అయితే అకీరా హైటు చూసిన చాలా మంది షాకవుతున్నారు. ఈ వయసులోనే అకీరా పవన్ కళ్యాణ్ ను మించి పోయాడు. అకీరా నందన్ లేటెస్ట్ ఫోటో చూసిన మెగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. నిన్న మొన్నటి వరకు పాలుగారే పసివాడిలా ఉన్న అకీరా రీసెంట్ గా అమ్మ రేణు దేశాయ్‌ని మించి పోయాడనుకుంటే.. ఇప్పుడు ఏకంగా పవన్ కంటే పొడుగు పెరిగి అందర్నీ అబ్బురపరుస్తున్నాడు యంగ్ పవర్ స్టార్ అకీరా.

loader