పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు ఓ శుభవార్త అందించాడు దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. సాధారణంగా సినిమాకు, సినిమాకు బాగా గ్యాప్‌ తీసుకునే పవన్‌.. త్రివిక్రమ్‌ సినిమాను ఏప్రిల్‌ ఆరో తేదీ నుంచే పట్టాలెక్కించేస్తున్నాడు. ఆ రోజు నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో స్టంట్‌ మాస్టర్‌ విజయన్‌ నేతృత్వంలో యాక్షన్‌ సీక్వెన్సెస్‌ను షూట్‌ చేయనున్నారట. ఈ సినిమా షూటింగ్‌ను కేవలం నాలుగు నెలల్లో పూర్తి చేసెయ్యాలని త్రివిక్రమ్‌ కృతనిశ్చయంతో ఉన్నాడట. బతుకమ్మ పండుగనాటికి ఈ సినిమా థియేటర్లలోనికి వచ్చేస్తుందట. పవన్‌ కల్యాణ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కనిపించనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా కనిపించనుంది.

 

మరోవైపు పవన్ కళ్యాణ్ ముందుగా త్రివిక్రమ్ సినిమా పూర్తి చేయాలని తీసుకున్న నిర్ణయం వెనుక బలమైన కారణమే ఉందని తెలుస్తోంది. తమిళ వీరమ్ రీమేక్ గా వచ్చిన కాటమరాయుడు మూవీకి మిక్స్ డ్ రెస్పాన్స్ రావటంతో... రీమ్ క్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇవ్వాలని భావిస్తున్నాడట. దాంతో ఎఎం రత్నం తలపెట్టిన వేదాళం సినిమా రీమేక్ ప్రాజెక్ట్ మరి కొంత కాలం ఆలస్యం కానుంది. మరోవైపు అసలు పవన్ కళ్యాణ్ వేదాళం రీమేక్ లో నటించాలా వద్దా అనే ఆలోచనలో కూడా పడినట్లు తెలుస్తోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ రూటు మార్చుకునే యోచనలో ఉన్నాడన్నమాట.