పవన్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడో తెలుసా?

pawan kalyan speech at jansena porata yatra in visakhapattanam
Highlights

ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నాకు బిడియం ఎక్కువగా ఉండేది. సుస్వాగతం సినిమా షూటింగ్ లో నాపై ఒక పాటను చిత్రీకరించాలని అనుకున్నారు. బస్ పైకి ఎక్కి వేలాది మంది  చూస్తుండగా నేను డాన్స్ చేయాలని చెప్పారు. నేను చాలా భయపడిపోయాను. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న సమయంలో రాజకీయాల్లోకి వెళ్లి ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు. ఆ దిశగా తన ప్రయత్నాలు షురూ చేశాడు. 'జనసేన' అనే పార్టీని స్థాపించి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాడు. మెగాఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అని కాకుండా తనకంటూ ప్రత్యేకంగా అభిమానులు సంపాదించుకున్నాడు.

అటువంటి హీరో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పి అందరూ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం జనసేన పార్టీ తరఫున ప్రజా పోరాట యాత్ర చేస్తోన్న పవన్ కళ్యాణ్ ఆదివారం విశాఖపట్టణం చేరుకున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రయాణం గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. పవన్ కెరీర్ ఆరంభంలో నటించిన 'సుస్వాగతం' సినిమా సమయంలో తను ఎదుర్కొన్న ఓ సంఘటన గురించి చెబుతూ..

''ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నాకు బిడియం ఎక్కువగా ఉండేది. సుస్వాగతం సినిమా షూటింగ్ లో నాపై ఒక పాటను చిత్రీకరించాలని అనుకున్నారు. బస్ పైకి ఎక్కి వేలాది మంది చూస్తుండగా నేను డాన్స్ చేయాలని చెప్పారు. నేను చాలా భయపడిపోయాను. ఏం చేయాలో తెలియక మా వదిన సురేఖకు ఫోన్ చేసి నేను సినిమాలో నటించడానికి సరిపోను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాను'' అంటూ వెల్లడించారు పవన్.  

loader