పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా పీకేపీఎస్25 సినిమా తాజా షెడ్యూల్  హైదరాబాద్ లో మొదలైంది. ఈ సినిమాకి ‘ఇంజనీర్ బాబు’ లేక ‘అజ్ఞాత వాసి’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్న విషయం తెలిసిందే.. రీసెంట్ గా బ్యాంకాక్ లో ఒక షెడ్యూల్ ను పూర్తిచేశారు.

 

కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించిన తరువాత యూరప్ లో కొన్ని కీలక సన్నివేశాలను రూపొందించేందుకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేశారు. డిసెంబర్ నాటికి అన్ని పనులను పూర్తి చేసి, జనవరి10వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు. సంఖ్యా పరంగా ఈ సినిమా ప్రత్యేకమైనది కావడంతో, పవన్ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోవాలని అభిమానులు భావిస్తున్నారు.

 

తాజా షెడ్యూల్ కి  పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ కూడా హాజరవు తున్నట్లు  విశ్వస నీయా సమాచారం.. అకీరా ను యూరప్ లో ప్రముఖ యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ చేస్తున్నట్లు తెలిసింది...అయితే యాక్టింగ్ లో శిక్షణ కోసమా లేక దర్శకత్వ శాఖ లో చేరుస్తారా అనే విషయం మాత్రం సస్పెన్స్ గా ఉంది.