తన ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్ కి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ షాకిచ్చాడని టాలీవుడ్ లో ప్రచారం సాగుతోంది. రీసెంట్ గా పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో కొత్త చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. జల్సా, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వస్తోన్న చిత్రం కాబట్టి సహజంగానే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అందుకు తగ్గట్లే పవన్ కోసం మాటల మాంత్రికుడు పవర్ ఫుల్ కథను సిద్ధం చేసినట్లు టాలీవుడ్ లో ప్రచారం సాగింది. దేవుడు దిగి వస్తే అనే టైటిల్ అనుకున్నారట.

 

అంతా బాగానే ఉన్నా.. పవన్ మాత్రం ఇప్పుడప్పుడే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు నో చెబుతున్నాడట. ఒక వైపు బిజీ షెడ్యూల్ మరోవైపు , పొలిటికల్ హడావుడితో పవన్ బిజీ అయ్యాడు. ఈ దశలో త్రివిక్రమ్ చిత్రాన్ని లేట్ గా ప్రారంభించే ఆలోచన చేస్తున్నాడు.అసలైతే ఈ సినిమా జనవరీలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోవాలి. పవన్ డేట్స్ ను అడ్జెస్ట్ చేసుకుంటూ.. జనవరిలో వారం, ఫిబ్రవరిలో 10 రోజులు ఇలా ప్లాన్ చేసారు.

 

కానీ..పవన్ ప్రస్తుతం ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించలేనని  చెప్పాడట. మార్చి తర్వాతే సినిమాను సెట్స్ పైకి తీసుకెళదామని అన్నాడట. ప్రస్తుతం పవన్ కాటమరాయుడు చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జనవరిలో ముగియనుంది. తర్వాత పవన్ వేదాళమ్ రీమేక్ లో నటించనున్నాడట. మార్చి లేదా ఏప్రిల్ వరకు ఈ సినిమా షూటింగ్ జరగనుంది.ఆ తర్వాతే త్రివిక్రమ్ మూవీ చేస్తాను అంటున్నాడట. దీంతో ప్రస్తుతం దర్శకనిర్మాతలు డైలమాలో పడ్డట్లు సమాచారం. సినిమా ప్రారంభించిన తర్వాత ఐదు నెలలు ఆగాలా.. అని డిసప్పాయింట్ అయ్యారట.