విలువలతో జీవిస్తే అన్నీ ఎదురు దెబ్బలే.. 'పంజా' సినిమా సమయంలో చనిపోవాలనుకున్నా: పవన్

pawan kalyan shares his bitter experience
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాలకే పరిమితమయ్యారు. ఇటీవల జరిగిన స్టూడెంట్ మీట్ లో ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాలకే పరిమితమయ్యారు. ఇటీవల జరిగిన స్టూడెంట్ మీట్ లో ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. మీ జీవితంలో జరిగిన ఏవైనా చేదు అనుభవాల గురించి చెబుతారా అని ఓ స్టూడెంట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా 17 ఏళ్ల వయసులో చనిపోవాలని అనుకున్నట్లు వెల్లడించాడు పవన్.

''చిన్నప్పుడు బాగా చదువుకోవాలనే కోరిక ఉండేది. కానీ పీయూసీ రాయలేక తిరిగి ఇంటికి వచ్చేశాను. దీంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. నా స్నేహితులందరూ చదువు విషయంలో నాకంటే ముందుండేవారు. వారితో పోల్చుకొని బాధపడి డిప్రెషన్ లోకి వెళ్లిపోయా.. నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదని చనిపోవాలనుకున్నాను. మా ఇంట్లో ఉన్న పిస్టల్ తో కాల్చుకొని చనిపోవాలని డిసైడ్ అయ్యాను. కానీ మా ఇంట్లో వాళ్లకి ఆ విషయం తెలిసిపోయింది. ఆ తరువాత గన్ లాక్కొని పెద్ద క్లాస్ పీకారు. ఆ తరువాత మెల్లగా ఆ పరిస్థితి నుండి బయటపడ్డాను.

మళ్లీ 'పంజా' సినిమా షూటింగ్ సమయంలో అలాంటి ఆలోచనే వచ్చింది. విలువలతో జీవిస్తే జీవితంలో అన్నీ ఎదురు దెబ్బలే తగిలాయి.. కొన్ని సార్లు ఎందుకు ఈ జీవితం అని నిరాశ కలిగింది. కానీ ఆ పరిస్థితి నేనే అధిగమించాను. ఇలా నిరుత్సాహానికి గురైన ప్రతీసారి ఆ పరిస్థితి నుండి బయటపడే ప్రయత్నం చేశాను. అలాంటి పరిస్థుతుల నుండి బయటపడి ముందుకు సాగడమే జీవితమని తెలుసుకున్నాను'' అంటూ వెల్లడించారు. 

loader