నేను ఎప్పుడు సన్యాసినవుతానో, సంసారిని అవుతానో నాకే తెలియదు : పవన్

pawan kalyan shares about his movies and family
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసి పూర్తిగా రాజకీయాల వైపు వచ్చేశారు. ప్రస్తుతం పవన్ దృష్టంతా 2019 ఎలక్షన్ల పైనే. పోరాట యాత్ర అంటు అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. వైజాగ్  యాత్రలోనే ఆయన తన సినిమాలు,కుటుంబసభ్యుల గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

తన సినిమాల గురించి మాట్లాడుతూ... నేను అంత మంచి నటుడిని కాను. నేను నటుడిగా ఏమీ సాధించలేదు. 25 సినిమాలు చేస్తే వంద సినిమాల ఇమేజ్ వచ్చింది. ఇదంతా దైవ నిర్ణయం. నాకు తెలియకుండానే ఇదంతా జరిగింది. ఇవి చూస్తుంటే దీని వెనుక కారణం ఏదో ఉంటుంది.. అంటు పవన్ చెప్పుకొచ్చారు. నాకంటూ భగవంతుడు అనుమతి ఇస్తే ఒకరోజు నన్ను ప్రజా క్షేత్రంలో తోస్తాడు లేదా ఇది నాది కాదు అనుకుంటే యోగి మార్గంలోకి వెళ్లిపోతాను. నాకు ఈ రెండు ఆప్షన్లే కనిపించాయి. ఎప్పుడూ సన్యాసి అవుతానో తెలియదు, ఎప్పుడు సంసారి అవుతానో తెలియదు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

నా పిల్లలు కూడా అంటూ ఉంటారు నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోతున్నావని... కానీ నేను ఏమీ చేయలేను. నా కూతురు అలా అడిగినపుడు తనను అక్కున చేర్చుకుని బాధ పడటం, కన్నీరు కార్చడం తప్ప వారితో పాటు ఉండలేను. ప్రజా సేవ కోసమే నేను పూర్తి సమయం గడపాలని నిర్ణయించుకున్నాను. అది నా పరిస్థితి.... అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
 
loader