Asianet News TeluguAsianet News Telugu

ఫేక్ ఫాలోవర్స్ లో పవన్, బన్నీనే టాప్!

ప్రస్తుత జీవన విధానంలో సోషల్ మీడియా కూడా ఒక భాగమైపోయింది

pawan kalyan's fake followers on twitter

ప్రస్తుత జీవన విధానంలో సోషల్ మీడియా కూడా ఒక భాగమైపోయింది. ప్రతి ఒక్కరూ కూడా ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్ లను క్రియేట్ చేసుకొని తమ అభిమాన తారలను ఫాలో అవుతుంటారు. ఇక ట్విట్టర్ లో అయితే సినిమా సెలబ్రిటీలకు మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉంటుంటారు. ఈ విషయంలో అభిమానులు కూడా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనుకుంటూ వాగ్వాదాలకు దిగుతుంటారు. కానీ ఇప్పుడు ఆ నంబర్స్ లో నిజం లేదని తేల్చేసింది ఓ సర్వే,

ప్రముఖ ఆంగ్ల పత్రిక చేసిన సర్వేలో సెలెబ్రిటీల ట్విట్టర్ ఫాలోవర్స్ లో చాలా మంది ఫేక్ అని వెల్లడించింది. ఆ లిస్టులో ముందుగా స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లు ఉండడం షాకిస్తోంది. పవన్ కళ్యాణ్ కు ట్విట్టర్ లో రెండు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. కానీ అందులో 46 శాతం మంది మాత్రమే నిజమైన ఫాలోవర్స్ అని తేల్చిచెప్పారు. అంటే దాదాపుగా 54శాతం ఫేక్ ఫాలోవర్స్ అన్నమాట. ఇక అల్లు అర్జున్ కు ట్విట్టర్ లో 2.43 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా అందులో అసలైన ఫాలోవర్స్ 11 లక్షల 96 వేల మంది మాత్రమే.. అంటే దాదాపుగా 51 శాతం మంది ఫేక్ ఫాలోవర్స్.

ఇక సమంతకు 6.78 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా అందులో ఫేక్ ఐడీలతో ఫాలో అవుతున్న వాళ్ళే 32 శాతం కనిపిస్తున్నారట. మహేష్ బాబుకి ఉన్న 6.47 మిలియన్ ఫాలోవర్స్ లో 31 శాతం ఫేక్ అని తేలింది.వీళ్ళు మాత్రమే కాదు రాజమౌళి, ఎన్టీఆర్ ఇలా చాలా మంది సినీ సెలబ్రిటీలలో సగానికి పైనే ఫేక్ ఫాలోవర్స్ ఉన్నారని తేల్చిచెబుతున్నారు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ తారలు కూడా ఈ ఫేక్ ఫాలోవర్స్ లిస్టులో పోటీ పడుతున్నారని సమాచారం.  

Follow Us:
Download App:
  • android
  • ios