ఇవాళ అసీఫా ఘటనపై ధర్నాకి వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పలు సంఘటనల మీద స్పందించారు. మానభంగానికి గురైన కశ్మీర్ బాలిక అసీఫా ఘటనను ప్రస్తావిస్తూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఈ వార్త విని నేను దుఖానికి లోనయ్యాను. చాలా బాధ వేసింది. అలాంటి దుష్ఠులను కఠినంగా శిక్షించాలి,’’ అని పవన్ కోరారు. ఇలాంటి దుర్మార్గులని తోలు వలచాలని చట్టాన్ని చేతులోకి తీసుకోవాల్సి వస్తుందని అన్నారు.హీరోయిన్  శ్రీ రెడ్డి గురించి అడగగా ఎదైన అన్యాయం జరిగితే  పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అంతేకాని టీవీల ముందుకొస్తే లాభం లేదుఅని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరైతే వాళ్లకు అన్యాయం చేశారో వాళ్లని శిక్షించేందుకు చట్టాలు ఉన్నాయి కోర్టులో కేసు వేయాలి అన్నారు. ఇలాంటి అర్ధనగ్న నిరసనల కంటే పోలీసులను సంప్రదించడం బెటర్ అంటూ చెప్పుకొచ్చారు పవన్.