ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్ రిలీజ్ తర్వాత ఈవెంట్ నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చే అవకాశం లేదంటున్న పవన్ సన్నిహితులు
మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 రిలీజ్ కు ముందు గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మెగా క్యాంప్ హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లు తాము మెగా ఈవెంట్ కు హాజరయ్యేందుకు షూటింగ్ వాయిదా వేసుకున్నామని అన్నారు. మరోవైపు అల్లు అర్జున్ కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యేందుకు రెడీ అవుతున్నాడు.ఇక మెగా ఫ్యాన్స్ తో పాటు అంతా ఎదురుచూస్తున్న ఒకే ఒక్కడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
మెగా స్టార్ ఖైదీ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ వస్తాడా రాడా అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. అయితే పవన్ తప్పకుండా వేడుకకు హాజరవుతాడని, మెగా ఫ్యామిలీ సన్నిహితుడొకరు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ కూడా బాబాయిని కలిసి వేడుకకు రావాలని కోరిన నేపథ్యంలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని మెగా ఫ్యాన్స్ తో పాటు అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఇంత సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న మెగాఫ్యాన్స్ కోరిక ఈసారికూడా నెరవేరేట్లు కనిపించట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన సన్నిహితులతో... మెగాస్టార్ కు ప్రీ రిలీజ్ ఈవెంట్ అవసరమే లేదని అన్నారట. దాని బదులు రిలీజ్ తర్వాత సక్సెస్ ఈవెంట్ నిర్వహించుకుంటే బావుంటుంది కదా అంటున్నారట. ఇప్పటికే రావాల్సిందానికంటే ఎక్కువ అటెన్షన్ అన్నయ్య మూవీపై క్రియేట్ అయిందని పవన్ అభిప్రాయపడుతున్నారట.
మరోవైపు మెగాస్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దర్శకరత్న దాసరి నారాయణరావును ముఖ్య అతిధిగా పిలిచారు. దీని వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలుస్తోంది. ఇంత చేస్తున్న పవన్ అన్నయ్య ఈవెంట్ కు తప్పక వస్తారని అంచనాలున్నాయి. ఏదేమైనా ఫ్యాన్స్ ను చివరి నిమిషం వరకు పవన్ సస్పెన్స్ తో చంపుతున్నారు. ఇప్పటికే పక్కన బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి పోటీ ఉండటంతో పవన్ రాక మరింత కలిసొస్తుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.
