భారీ అంచనాల మధ్య రూపొందుతున్న పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘ఓజి (They Call Him OG)’ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఇది ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 

భారీ అంచనాల మధ్య రూపొందుతున్న పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘ఓజి (They Call Him OG)’ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఇది ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ సినిమా తొలి రోజు నుంచే ఊహించిన అంచనాలకు మించిన హైప్‌ను సృష్టించింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఊహించని విధంగా ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. 

ఈ యాక్షన్ డ్రామాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదటగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడు గా పని చేస్తున్నారు. దాదాపుగా షూటింగ్ కూడా పూర్తి కావచ్చింది. కానీ చివరి దశలో ఓజి సినిమాటోగ్రాఫర్ మార్పు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రవి కె చంద్రన్ బిజీగా ఉండడం వల్ల ఓజి మిగిలిన భాగానికి సినిమాటోగ్రఫీ అందించలేకపోతున్నారట. ఆయన ప్రస్తుతం శివకార్తికేయన్ పరాశక్తి చిత్రంతో బిజీగా ఉన్నారు. 

దీనితో చిత్ర యూనిట్ రవి కె చంద్రన్ స్థానంలో సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస ఎంపికైనట్లు తెలుస్తోంది. మనోజ్ ‘ఏ మాయ చేసావే’, ‘రేసుగుర్రం’, ‘లియో’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు పని చేసిన అనుభవం ఉన్నటువంటి టాలెంటెడ్ డీఓపీ. గుంటూరు కారం చిత్రానికి కూడా కొంతభాగం ఆయన పనిచేశారు. 

విశేషమేంటంటే, మనోజ్ పరమహంస ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ ‘హరి హర వీర మల్లు’ సినిమాకూ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. కానీ ఈ మార్పుపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా విడుదల కాలేదు.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. అలాగే అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, ప్రకాష్ రాజ్, షామ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ అందిస్తున్నారు.

DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి. దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా‌గా తెరకెక్కుతోంది. మేకర్స్ త్వరగా షూటింగ్‌ను పూర్తి చేసి, సినిమాను సెప్టెంబర్ 2025లో గ్రాండ్‌గా విడుదల చేయాలనే లక్ష్యంతో ఉన్నారు.