అనర్థాలకు దారి తీసే ఏదైనా అతి మంచిది కాదు. కొన్నాళ్లుగా పవన్ ఫ్యాన్స్ తీరు కూడా ఇలానే ఉంది. సభల్లో వాళ్ళు చేసే రచ్చ, స్వయంగా పవన్ కళ్యాణ్ కే నచ్చని పరిస్థితి చోటు చేసుకుంటుంది.  

అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ కి భక్తులు ఉంటారు. ఇది వినడానికి బాగానే ఉన్నా ఆ భక్తి హద్దులు దాటితే పూజించే దేవుడుకి కూడా కోపం వస్తుంది. అనర్థాలకు దారి తీసే ఏదైనా అతి మంచిది కాదు. కొన్నాళ్లుగా పవన్ ఫ్యాన్స్ తీరు కూడా ఇలానే ఉంది. సభల్లో వాళ్ళు చేసే రచ్చ, స్వయంగా పవన్ కళ్యాణ్ కే నచ్చని పరిస్థితి చోటు చేసుకుంటుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred


మెగా ఫ్యామిలీకి చెందిన ఏ హీరో ఈవెంట్ అయినా కూడా Pawan kalyan ఫ్యాన్స్ దిగిపోతారు. సదరు వేడుకకు వచ్చిన డైరెక్టర్, నిర్మాత, హీరో, హీరోయిన్ ఎవరినీ మనస్ఫూర్తిగా మాట్లాడనివ్వరు. తమ హీరో పవన్ గురించి మాట్లాడాలని బలవంత పెడతారు. ఒక విధంగా చెప్పాలంటే డిమాండ్ చేస్తారు. లేదంటే అల్లరి చేస్తారు. వీళ్ళ గోలకు విసిగిపోయిన నాగబాబు, అల్లు అర్జున్ ఓపెన్ గా ఫైర్ అయిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో పవన్ పేరు 'చెప్పను బ్రదర్' అన్న Allu arjun ని తెగ ట్రోల్ చేశారు. ఆయన సినిమా టీజర్స్, ట్రైలర్స్ పై డిజ్ లైక్స్, నెగిటివ్ కామెంట్స్ తో పగ తీర్చుకునే ప్రయత్నం చేశారు. 


మిగతా వాళ్ళ సంగతి అటుంచితే వాళ్ళ ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ కి కూడా వీళ్ళ భజన అంటే విసుగొచ్చేసింది. సందర్భం ఏదైనా పవన్ మాట్లాడేటప్పుడు పవర్ స్టార్, సీఎం సీఎం అనే నినాదాలతో సభను హోరెత్తిస్తారు. పవన్ అసలు చెప్పాలనుకున్న విషయం కూడా మరిచిపోయి రేంజ్ లో వీళ్ళ అరుపులు ఉంటాయి. ఈ గోల భరించలేక పవన్ ఓపెన్ గా అసహనం ప్రదర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఎవరు చెప్పినా మేము మారం అన్న తీరు కలిగిన పవన్ ఫ్యాన్స్, ఆ సాంప్రదాయం కొనసాగిస్తున్నారు. 

Also read “భవదీయుడు భగత్ సింగ్” స్టోరీ పై ఓ ఇంట్రస్టింగ్ లీక్
నిన్న విశాఖ వేదికగా ఉక్కు దీక్ష పేరుతో పవన్ కళ్యాణ్ ఓ సభ నిర్వహించాడు. ఈ మీటింగ్ కి ఫ్యాన్స్ భారీగా హాజరయ్యారు. ఈ సభలో పవన్ మాట్లాడుతున్న సమయంలో ఫ్యాన్స్ నినాదాలతో రెచ్చిపోయారు. తీవ్ర అసహనానికి గురైన పవన్ కళ్యాణ్ వాళ్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తన సభలకు జనం వస్తారు కానీ, ఓట్లు మాత్రం వైసీపీ వాళ్లకు వేస్తారు అంటూ.. మనసులో బాధ బయటపెట్టారు. ఆ మధ్య పవర్ లేని వాడికి పవర్ స్టార్ బిరుదు ఎందుకు, అలా పిలవకండి, అన్నారు పవన్. స్వయంగా పవన్ పలు మార్లు చెబుతున్నా ఫ్యాన్స్ లో మాత్రం కొంచెం కూడా మార్పు రావడం లేదు. 

Also read ఒకే ఫ్రేమ్ లో బాలయ్య, ఎన్టీఆర్, సర్వం సిద్దం?