- Home
- Entertainment
- Jr NTR last 5 Movies: ఎన్టీఆర్ చివరి 5 సినిమాల రిజల్ట్స్..చెడగొట్టింది అదొక్కటే, నెక్స్ట్ సినిమాల లైనప్ ఇదే
Jr NTR last 5 Movies: ఎన్టీఆర్ చివరి 5 సినిమాల రిజల్ట్స్..చెడగొట్టింది అదొక్కటే, నెక్స్ట్ సినిమాల లైనప్ ఇదే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. రీసెంట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించేందుకు పచ్చ జెండా ఊపారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ నటించిన చివరి 5 సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ డ్రాగన్ అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్ రేంజ్ పెరిగింది. ఎన్టీఆర్ నటించిన చివరి 5 సినిమాలు ఏంటి.. అవి ఎలాంటి రిజల్ట్స్ సాధించాయి.. తదుపరి చిత్రాల లైనప్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
జై లవకుశ
డైరెక్టర్ బాబీ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన జై లవకుశ చిత్రంలో తారక్ ట్రిపుల్ రోల్ లో నటించి అదరగొట్టారు. ముఖ్యంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న జై పాత్రలో తారక్ నట విశ్వరూపం ప్రదర్శించారు. ఈ సినిమాలో కొన్ని మైనస్ లు ఉండడం తో సూపర్ హిట్ కాలేదు కానీ పర్వాలేదనిపించే విజయం అందుకుంది.
అరవింద సమేత వీర రాఘవ
త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ తొలిసారి నటించిన చిత్రం అరవింద సమేత. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ తన మార్క్ ట్రీట్మెంట్, సందేశంతో ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ఈ మూవీలో అదరహో అనిపించేలా ఉంటుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
ఆర్ఆర్ఆర్
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ నటించిన ఈ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ స్థాయిలో ఈ చిత్రం తెలుగు సినిమాకు గుర్తింపు తీసుకువచ్చింది. ఈ మూవీలో తారక్ కొమరం భీం పాత్రలో నటించారు.
దేవర 1
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ రెండవసారి నటించిన మూవీ దేవర. అంతకు ముందు వీరి కాంబోలో జనతాగ్యారేజ్ మూవీ వచ్చింది. దేవర చిత్రం కొంత వరకు టాక్ పరంగా నిరాశ కలిగించింది కానీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.
వార్ 2
తారక్ చివరి 5 సినిమాల్లో.. ఎందుకు చెశాడ్రా అనిపించినా మూవీ ఇదే. సూపర్ హిట్ ప్రాంఛైజీ వార్ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీలో తారక్, హృతిక్ కలసి నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దారుణంగా నిరాశ పరిచింది.
ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీస్ లైనప్
ఇక తారక్ తదుపరి సినిమాల లైనప్ చాలా స్టాంగ్ గా ఉంది. ప్రస్తుతం తారక్ డ్రాగన్ మూవీలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ అనే మూవీ అనౌన్స్ చేశారు. ఇది ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియదు. రీసెంట్ గా ఎవ్వరూ ఊహించని విధంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించేందుకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.









