Asianet News TeluguAsianet News Telugu

“భవదీయుడు భగత్ సింగ్” స్టోరీ పై ఓ ఇంట్రస్టింగ్ లీక్

ఫస్ట్ లుక్ పోస్టర్ లో ..ఇండియా గేట్ ముందు స్పోర్ట్స్ బైక్ మీద కూర్చుని పవన్ ఒక చేతిలో టీ, మరో చేతిలో మెగాఫోన్ తో పోస్టర్ వదిలారు. ఆ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. దర్శకుడు హరీష్ శంకర్ ఫస్ట్ లుక్ తోనే మెగాభిమానుల మనసు దోచుకున్నాడు.

Pawan Kalyans Bhavadeeyudu Bhagat Singh Is A Political Thriller
Author
Hyderabad, First Published Oct 31, 2021, 2:06 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను భారి ఎత్తున మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.  ‘పిఎస్పీకే 28’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పవర్ ప్యాక్డ్ అప్డేట్ అంటూ వదిలిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. “భవదీయుడు భగత్ సింగ్” అనే టైటిల్ ను ఖరారు చేస్తూ విడుదల చేసిన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ స్టైలిష్, యంగ్ లుక్‌లో కన్పిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా గురించిన మరో అప్డేట్ ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది.  ఈ సినిమాని అందరూ సోషల్ డ్రామా అని భావిస్తున్నారు. అదేమీ కాదని చెప్తున్నారు.

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా హై ఓల్టేజి పొలిటికల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. కథ మొత్తం డిల్లీలో జరుగుతుందని,, జాతీయ రాజకీయాలు కథలో కీలకం కాబోతున్నాయని వినికిడి. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా చేసారు. 2012లో వచ్చిన ఈ చిత్రం అప్పటి సెపరేట్ తెలంగాణా మూమెంట్ చుట్టూ తిరిగింది.  వివాదాస్పదమైనా ఈ సినిమా మంచి విజయం సాధించింది. మళ్లీ పదేళ్ల తర్వాత పొలిటికల్ పాయింట్ తో పవన్ కళ్యాణ్ రాబోవటం ఆసక్తికరమైన విషయంగా మారింది. ఈ నేపధ్యంలో  2024లో రాబోతున్న ఆంధ్రా ఎలక్షన్స్ ని టార్గెట్ చేస్తుందని కొందరంటున్నారు.
 
అందుకే ఫస్ట్ లుక్ పోస్టర్ లో ..ఇండియా గేట్ ముందు స్పోర్ట్స్ బైక్ మీద కూర్చుని పవన్ ఒక చేతిలో టీ, మరో చేతిలో మెగాఫోన్ తో పోస్టర్ వదిలారు. ఆ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. దర్శకుడు హరీష్ శంకర్ ఫస్ట్ లుక్ తోనే మెగాభిమానుల మనసు దోచుకున్నాడు. వారి అంచనాలను అందుకునేలా ఫస్ట్ లుక్ పోస్టర్ ను డిజైన్ చేయడంలోఆయన సక్సెస్ అయ్యాడు. ‘ఈసారి ఇది కేవలం వినోదం మాత్రమే కాదు’ అనే ట్యాగ్‌లైన్ ఉత్సుకతని రేకెత్తించింది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అయనంక బోస్ సినిమాటోగ్రాఫర్ కాగా, ఎడిటింగ్ చోటా కె ప్రసాద్. 
 

Follow Us:
Download App:
  • android
  • ios