Asianet News TeluguAsianet News Telugu

అసెంబ్లీకే రాని వైసీపీ హోదాపై ఏం పోరాడుతుంది-పవన్ కల్యాణ్

  • అసెంబ్లీకే రాని వైసీపీ హోదాపై ఏం పోరాడుతుంది-పవన్ కల్యాణ్
  • నేను తెలుగుదేశం అభివృద్ధికోసం కలవలేదు
  • ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసమే తెదెపాతో చేతులు కలిపా
pawan kalyan negative comments on ysrcp jagan

తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వుంటే వీళ్లు నన్ను ఏం చేసేవాళ్లో తెలిసీ ఎందుకు టీడీపీకి మద్దతిచ్చానంటే.. కేవలం ఆంధ్ర పురోభివృద్ధి కోసం మాత్రమేనని పవన్ స్పష్టం చేశారు. అంతేకానీ తెలుగుదేశం పార్టీ కోసం కాదని పవన్ తెలిపారు.

నేను ఈ నాలుగేళ్లలో సీఎం గారిని పలుమార్లు కలిశాను. రాజధానికి 1500-2000 ఎకరాలుంటే చాలు అన్నారు. నేను నమ్మాను. కానీ 33 వేల ఎకరాలు కాదు. లక్ష ఎకరాలు విస్తరించింది. అభివృద్ధి కొందరికేనా.. అందరికీ కాదా.. అనిపించింది. తెలుగుదేశం ఆదిశగా ఆలోచిస్తున్నట్లు అనిపించలేదు. 15లక్షల కోట్ల ఎంఓయూలు కుదుర్చుకున్నారంటే ఎన్నో ఉద్యోగాలు వస్తాయనుకున్నా. కానీ ఏమీ కాలేదు. కేవలం రాజధాని చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతమైతే... ఉత్తరాంథ్ర, రాయలసీమ, ప్రకాశం ఏం కావాలి. తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమం రావాలా ఏంటి. ఎందుకిలా చేస్తున్నారని అర్థం కాలేదు.

నేను 2016లో తిరుపతిలో మాట్లాడినప్పుడు.. చీకటి ఒప్పందం చేసుకుని ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. కాకినాడలో పాచిన లడ్డూలు అంటే... పాచిన లడ్డూలే తింటామన్నారు. దానికి చట్టబద్దత లేదని అనంతపురంలో చెప్తే కల్పిస్తామన్నారు. ఇన్ని చెప్పి ఈ రోజు... చట్టబద్దత లేదంటున్నారు. మరి ప్రజలకు చేతకాని వాళ్లనుకుంటారా.. ఇంకేం మాట్లాడుతారో చూద్దామంటే.. 2016లో మనం ఏం చెప్పామో మళ్లీ దానికే వచ్చారు. నరసింహన్ గారి చేత కూడా అసెంబ్లీలో చదివించారు. ఈ కాడికి 2016లోనే చెప్పాలిగా. ఎందుకు మోసం చేశారు.

పోలవరం జాతీయ ప్రాజెక్టు. కేంద్రంతో మాట్లాడుకుని ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఇప్పించినప్పుడు, ముంపు మండలాలకు ఆర్డినెన్స్ తెప్పించినప్పుడు.. హోదాపైన ఎందుకు పోరాటం చేయలేదు. మా ఆత్మగౌరవం మీద కొట్టారు. తెలుగు దేశం నేతలు, బీజేపీ కలిసి ఈ దారుణం చేశారు. వైసీపీ బలంగా పోరాడుతారా అంటే అసెంబ్లీకే రారు. ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వస్తారా. ప్రజా సమస్యలపై పోరాటానికి అన్నివిధాలా సిద్ధంగా వుండకుంటే మీరనుకున్న లక్ష్యం చేరుకోలేరు.

Follow Us:
Download App:
  • android
  • ios