పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న హీరోలెవరంటే ఫస్ట్ వినిపించేది ఈ పేర్లే. ఈ ఇద్దరు ఒకే వేడుకలో కనిపిస్తే... ఆ సీన్ అదుర్స్ అనిపిస్తుంది. అభిమానులు జల్సా చేసుకుంటారు. ఇప్పుడదే జరిగింది.

 

తెలుగు ఇండస్ట్రీలో హ్యాట్రిక్ విజయం సాధించి..ఇటీవలే జై లవకుశ చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్నాడు ఎన్టీఆర్. తాజాగా ఎన్టీఆర్  28వ చిత్రం ఈ రోజు పట్టాలెక్కబోతుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించనున్నాడు. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా నేడు లాంఛనంగా ప్రారంభం కానుంది.  ఈ చిత్రం ప్రారంభోత్సవానికి పవన్‌ కళ్యాణ్‌ అతిథిగా హాజరయ్యారు.

 

పూజా కార్యక్రమాలు అనంతరం తొలి షాట్‌కు పవనే క్లాప్‌ కొట్టారు. 2018 జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఓపెనింగ్ మాత్రమే ! రెగ్యులర్ షూటింగ్ వచ్చి వచ్చే ఏడాది నుండి జరుగనుందని చిత్ర యూనిట్ తెలిపింది.

 

హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రావడం విశేషం. పవన్ కల్యాణ్‌తో పాటు కల్యాణ్ రామ్, హరికృష్ణలు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. 

 

ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తుండటంతో సినిమా ప్రారంభానికి ముందే అంచనాలు ఏర్పడుతున్నాయి. మిలిటరీ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని మొదట వార్తలు వచ్చినప్పటికీ.. ఇది పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని తాజా సమాచారం. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

 

ఇక ఇద్దదరు అగ్ర హీరోల.. మాస్ లో యమా పాలోయింగ్ వున్నన హీరోలు ఇలా ఒకరికొకరు సహకరించుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. ఈ మైత్రి భవిష్యత్ లో పెను సంచలనాలకు దారితీయాలని ఆశిస్తున్నారు.