పోరాటం పవన్ రక్తంలోనే వుంది,ఆయనే సీఎం కావాలి-నటి శ్రీ రెడ్డి

పోరాటం పవన్ రక్తంలోనే వుంది,ఆయనే సీఎం కావాలి-నటి శ్రీ రెడ్డి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఇటీవల సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తునన్న వాళ్లల్లో బాగా టార్గెట్ అయింది నటి శ్రీ రెడ్డి. తను పవన్ కల్యాణ్ ఇండస్ట్రీలో నటీమణుల పట్ల జరుగుతున్న అన్యాయాలపై స్పందించాలని, పవన్ చొరవ చూపి తెలుగు అమ్మాయిలకు తెలుగు సినిమాల్లో అవకాశాలు కల్పించాలని శ్రీ రెడ్డి డిమాండ్ చేసిన నేపథ్యంలో.. టార్గెట్ గా మారింది. అయితే పవన్ కల్యాణ్ పై తాను ఏలాంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయలేదని, పవన్ అంటే తనకెంతో గౌరవమని అంటోంది శ్రీరెడ్డి. అంతే కాక పవన్ ను తెగ పొగిడేస్తోంది.

 

అసలు పవన్ కల్యాణ్ కు తెలుగు ప్రజల పట్ల ఎంతో మమకారం వుంటుందని శ్రీ రెడ్డి అంటోంది. అంతే కాదు.. పవన్ కల్యాణ్ అణువణువునా తెలుగు వుందని, పోరాటం ఆయన రక్తంలో వుందని శ్రీ రెడ్డి అంటోంది. పవన్ కు చరిత్ర పై వున్న పట్టు, ఆయనకున్న సామాజిక స్పృహ, ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అంతేకాక ఇండస్ట్రీలో ఆయనకున్న క్రేజ్ కూడా మామూలుది కాదు. అందుకే ఆయన ఏమైనా జోక్యం చేసుకోవాలని పాజిటివ్ దృక్పథంతో.. చెప్పానే తప్ప దురుద్దేశం లేదని శ్రీ రెడ్డి తెలిపింది. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని తానూ కోరుకుంటున్నానని, తనకు పవన్ అంటే ఎంతో అభిమానమని శ్రీ రెడ్డి వ్యాఖ్యానించింది. తన తల్లిదండ్రులకు రాజశేఖర్ రెడ్డి అంటే ఎంతో అభిమానమని అంది శ్రీ రెడ్డి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos