బిగ్ బాస్ హౌస్ లో పవన్ క్రేజ్!

pawan kalyan craze in bigg boss2
Highlights

హౌస్ లో దీప్తికి పవర్ స్టార్ పాటను ఇచ్చారు. తీన్ మార్ సినిమాలో పవన్ నటించిన 'ఓహో బస్తీ దొరసాని' పాటను దీప్తి.. నానికి వివరించాలి. ముందుగా ఆ పాటని గుర్తుపట్టని నాని పవర్ స్టార్ సాంగ్ అనగానే వెంటనే చెప్పేశాడు

మొదట్లో బిగ్ బాస్ సీజన్ 2 పై నెగెటివ్ కామెంట్స్ వినిపించినప్పటికీ రెండు వారాలుగా ఈ షో పుంజుకుంది. ఎలిమినేషన్, బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లతో షో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక శని,ఆదివారాలు వచ్చేసరికి నాని తనదైన స్టైల్ లో షోని మరింత రక్తికట్టిస్తున్నారు. ఈ వారాంతంలో అయితే షో మరింత ఇంట్రెస్టింగ్ గా సాగిందనే చెప్పాలి. శనివారం మొత్తం ఇంటి సభ్యులకు క్లాస్ తీసుకున్న నాని ఆదివారం వారందరికీ ఒక టాస్క్ ఇచ్చారు.

హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఐస్ గడ్డ మీద నిలుచొని వారికిచ్చిన రెండు పాటల్లో ఒక పాటను హౌస్ లో సభ్యులకు సైగ చేసి గెస్ చేసేలా చేయాలి. మరొక పాటను నానికి సైగ ద్వారా చెప్పి ఆయన గుర్తుపట్టేలా చేయాలి. ఆ పాటను గుర్తుపట్టే వరకు వారు ఐస్ గడ్డ నుండి కిందకి దిగకూడదు. అలా ఆదివారం షో మొత్తం ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇందులో భాగంగా హౌస్ లో దీప్తికి పవర్ స్టార్ పాటను ఇచ్చారు.

తీన్ మార్ సినిమాలో పవన్ నటించిన 'ఓహో బస్తీ దొరసాని' పాటను దీప్తి.. నానికి వివరించాలి. ముందుగా ఆ పాటని గుర్తుపట్టని నాని పవర్ స్టార్ సాంగ్ అనగానే వెంటనే చెప్పేశాడు. దీంతో వెంటనే హౌస్ మొత్తం కేకలతో హోరెత్తించారు. బిగ్ బాస్ హౌస్ లో కూడా పవన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. టాస్క్ ముగిసిన వెంటనే హౌస్ లో వారందరితో గున్న గున్న మామిడి పాటకు డాన్స్ చేయించారు నాని.  ఇక ఈ వారంలో ఎలిమినేషన్ లో భాగంగా భానుశ్రీను ఎలిమినేట్ చేశారు. 

loader