ప్రతీ నియోజక వర్గానికి పాతిక కోట్లు పెట్టేశాం. అన్నీ సర్దేశాం అని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ప్రకాశం పంతులు, ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది. వీళ్లకు ఈ అవినీతి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది.

 

సీఎం గారూ... మీ అబ్బాయి నేరుగా చేస్తున్న అవినీతి మీకు తెలుసా లేదా.. తెలిసే చేయిస్తున్నారా లేదా.. మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. నాకు వ్యక్తిగతంగా మీ మీద చాలా గౌరవం వుంది. కానీ మీ అనుభవం... ఆంధ్ర ప్రదేశ్ లో అవినీతి లో నంబర్ వన్ స్థానంలో వుంది. ఇదేనా మనం సాధించింది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్పాను. సీఎంకు పట్టులేదా.. లేక తెలిసే చేస్తున్నారా.  అయితే 2019లో సరికొత్త నాయకున్ని ఎన్నికుని తీరుతారు. 2014 ఎన్నికలంత సుఖంగా 2019 ఎన్నికలు వుండవు. అమరావతి రైతుల భూములు తీసుకున్నారు. వాళ్లకిచ్చిన పట్టాలు చెల్లుతాయా లేదా అనే భయంతో రైతులు బతుకుతున్నారు. మీ అవినీతి అంటే అంత భయపడుతున్నారు.