'సై రా' సెట్ లో పవన్ సందడి.. మెగాబ్రదర్స్ తో పాటు బిగ్ బీ!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 27, Aug 2018, 3:02 PM IST
Pawan Kalyan At Chiranjeevi Sye Raa Shooting
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో పవన్ సెట్స్ కి వెళ్లిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో పవన్ సెట్స్ కి వెళ్లిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోటోని బట్టి ఇది రీసెంట్ గా తీసుకున్నది కాదని తెలుస్తోంది. రెండు, మూడు నెలల క్రితం తీసుకున్న ఫోటో అని తెలుస్తోంది.

ఈ ఫొటో స్పెషల్ ఏంటంటే.. మెగాస్టార్, పవర్ స్టార్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. చిరు, అమితాబ్ సినిమా గెటప్పులో ఉండగా పవన్ మాత్రం క్లీన్ షేవ్ తో కనిపిస్తున్నారు. ఈ ముగ్గురితో పాటు రామ్ చరణ్, సత్యానంద్ కూడా కూడా ఉన్నారు. చిరంజీవి ఈ ఫోటోని ఫ్రేమ్ చేయించి ప్రత్యేకంగా సత్యానంద్ కి పంపించారట. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఇక సై రా విషయానికొస్తే ఇటీవల మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి వంటి తారలు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.  

ఇది కూడా చదవండి.. 

రాఖీ వేడుకల్లో చిరంజీవి!

loader