రాఖీ వేడుకల్లో చిరంజీవి!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 26, Aug 2018, 12:43 PM IST
rakshabandhan celebrations in megastar chiranjeevi's house
Highlights

మెగాస్టార్ చిరంజీవి రాఖీ వేడుకలు జరుపుకుంటున్నారు. మెగాఫ్యామిలీకి చెందిన ప్రతి వేడుకను సోషల్ మీడియాలో షేర్ చేసుకునే ఉపాసన రాఖీ సందర్భంగా చిరంజీవికి సంబంధించిన వీడియో షేర్ చేసింది. 

మెగాస్టార్ చిరంజీవి రాఖీ వేడుకలు జరుపుకుంటున్నారు. మెగాఫ్యామిలీకి చెందిన ప్రతి వేడుకను సోషల్ మీడియాలో షేర్ చేసుకునే ఉపాసన రాఖీ సందర్భంగా చిరంజీవికి సంబంధించిన వీడియో షేర్ చేసింది. చిరంజీవికి ఆయన ఇద్దరు చెల్లెళ్లు రాఖీలు కట్టి ఆయన పాదాలకు మొక్కుతున్న వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఉపాసన. 'మామయ్య రాఖీ సెలబ్రేషన్స్ విత్ లవ్లీ సిస్టర్స్' అంటూ కామెంట్ పెట్టారు.

తనకు రాఖీ కట్టిన ఇద్దరి చెల్లెల్ని ప్రేమగా దగ్గర తీసుకొని వారికి కానుకలు ఇస్తోన్న ఈ వీడియో అభిమానులను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'సై రా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తున్నారు. చిరు పుట్టినరోజు సందర్భంగా ఇటీవల సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

 

loader