ఆజ్ఞాతవాసి టీమ్ కు వాయిదా వేయక తప్పలేదు

pawan kalyan agnyaatha vaasi audio release postponed
Highlights

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న అజ్ఞాతవాసి

అజ్ఞాతవాసి ఆడియో రిలీజ్ కు అడ్డుపడుతున్న తెలుగు మహాసభలు

దీంతో 14 అనుకున్న ఆడియో వేడుకను 24కు వాయిదా వేసినట్లు సమాచారం

ప్రస్థుతం టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రాబోతోన్న ‘అజ్ఞాతవాసి’ ఫీవర్ నడుస్తోంది. ఈ కాంబినేషన్ లో వస్తోన్న... మూడో సినిమా ‘అజ్ఞాతవాసి’ కావడంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాక ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌తో పాటు పవన్ కళ్యాణ్ ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేయడంతో ఈ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.

 

2018 సంక్రాంతి కానుకగా.. జనవరి 10న భారీ విడుదలకు ‘అజ్ఞాతవాసి’ రెడీ అయ్యారు. డిసెంబర్ 14 లేదా 15 తేదీల్లో ఆడియో వేడుకను నిర్వహించాలని భావించారు. అయితే అదే టైంకి తెలుగు మహాసభలు ఉండటంతో.. ‘అజ్ఞాతవాసి’ సాంగ్స్ విడుదలకు మరో ముహూర్తం కోసం ఆలోచనలో పడ్డారు చిత్రయూనిట్. దీంతో ముందుగా అనుకున్న తేదీన కాకుండా డిసెంబర్ 24న ‘అజ్ఞాతవాసి’ ఆడియో విడుదల కానునట్లు తెలుస్తోంది.

 

తమిళ సంగీత సంచలనం అనిరుధ్.. ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఇటీవల ఈ మూవీ నుండి విడుదల చేసిన తొలి సాంగ్ ‘బయటకొచ్చి చూస్తే.. టాప్ ట్రెండింగ్‌లో ఉండగా.. డిసెంబర్ 11న రెండో సాంగ్‌ను సోషల్ మీడియాలో విడుదల చేయనున్నారు. గాలి వాలుగా.. అంటూ సాగే ఈ సాంగ్ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

loader