Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రాలో "అజ్ఞాతవాసి" ఆడియో ఫంక్షన్, ఫ్లైట్స్ పై ప్రమోషన్

  • పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న అజ్ఞాతవాసి
  • అజ్ఞాతవాసి చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు నిర్ణయం
  • ఆడియో వేడుకను ఆంధ్రా ప్రాంతంలో నిర్వహించేందుకు ప్లాన్
pawan kalyan agnyaatha vaasi audio release in andhra

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ కాంబినేషన్‌లో జల్సా, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ సినిమాలు రావడంతో ‘అజ్ఞాతవాసి’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తమ హీరో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

సంక్రాంతి కానుగా జనవరి 10న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఆడియో ఫంక్షన్‌ పై అభిమానుల దృష్టి మళ్లింది. ఆడియో వేడుకను హైదరాబాద్‌లోనే ఏర్పాటుచేయాలని భావించారు. అయితే రాజధానిలో ప్రస్తుతం పలు సమావేశాలతో పెద్ద వేదికలన్నిటినీ ఆక్రమించాయి. దీంతో ఆడియో ఫంక్షన్ వేదికను మార్చాలని ‘అజ్ఞాతవాసి’ టీం నిర్ణయించినట్లు టాక్. అమరావతిలో అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట. అయితే ఇంకా తుది నిర్ణయానికి రాలేదని.. నిర్మాతలు పవన్ కళ్యాణ్‌ను సంప్రదించిన తరవాత విజయవాడలో కానీ లేదంటే తిరుపతిలో కానీ వేదికను ఖరారు చేస్తారని సమాచారం.పవన్ కళ్యాణ్ కూడా ఆడియో వేడుకను ఆంధ్రాలో నిర్వహిస్తేనే బాగుంటుందని అంటున్నారట.

 

‘అజ్ఞాతవాసి’ సినిమా తరవాత జనసేన పార్టీ కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని పవన్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతంలోనే ఆడియో ఫంక్షన్ నిర్వహిస్తే అదీ ఓ ప్రచారంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారట. పవన్ నిర్ణయించిన వెంటనే వేదికను ఫిక్స్ చేసేస్తారని తెలుస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ‘అజ్ఞాతవాసి’ ఫస్ట్ సింగిల్ ఇప్పటి విపరీతంగా ఆకట్టుకుంటోంది.

 

ఇక ప్రమోషన్ విషయంలోనూ వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. అజ్ఞాతవాసి మొబైల్స్ లాంచ్ తోపాటు 14 మెట్రో రైళ్లలో అజ్ఞాతవాసి ప్రచారం నిర్వహిస్తారట. అంతే కాక స్పైస్ జెట్ విమాన సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని హైదరాబాద్ నుంచి విశాఖ, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే రెండు ఫ్లైట్స్‌లో 'అజ్ఞాతవాసి' బ్రాండింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

Follow Us:
Download App:
  • android
  • ios