పవన్ కళ్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా రిలీజ్ కు సమయం దగ్గరపడింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న చిత్రం రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే దోపిడీకి రంగం సిద్ధమైందంటూ కత్తి మహేష్ లాంటి వాళ్లు విమర్శలు చేస్తున్నా, గులాంగిరీకి ఒక చోట, సలాంగిరీకు ఒకచోట దోపిడీకి అనుమతులు తెచ్చుకున్నాడని ఆరోపిస్తున్నా ప్రత్యేక షోలకు అనుమతి తెచ్చుకున్నారు.

 

2014 ఎన్నికల సమయంలో పవన్ పార్టీ స్థాపించడం, టీడీపీకి తన మద్దతు తెలపడం, ఆ తరవాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. ప్రభుత్వ పాలనలో లోపాలు చూపుతూ టీడీపీపై అప్పుడప్పుడు పవన్ విమర్శలు చేసినా చంద్రబాబు ఏనాడు పెద్దగా స్పందించలేదు. పవన్ సూచనలను స్వీకరిస్తామని, వాటిని ఆచరణలోకి తెస్తామనే చెప్పారు. పవన్ కూడా ఏనాడు చంద్రబాబును నేరుగా విమర్శించలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు, పవన్ కలిసి నడుస్తారనే ఊహాగానాలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. దీనికి తోడు వీడు మళ్లీ సైకిలెక్కుతాడంటారా.. అంటూ ట్రైలర్ లోనే డైలాగ్ వినిపించి పొలిటికల్ హీట్ క్రియేట్ చేస్తున్నారు అజ్ఞాతవాసి మేకర్స్.ఇదిలా ఉంటే పవన్.,బాబుల మైత్రి రాజకీయాలకే కాకుండా సినిమాలకు కూడా ఉపయోగపడుతోంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలసిందే. జనవరి 10న విడుదలవుతున్న ఈ సినిమాకి చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్ అందించారు. ఈ చిత్రానికి తొలి వారం రోజుల పాటు రోజుకు 7 షోలు ప్రదర్శించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీనికి సంబంధించిన ఫైలుపై చంద్రబాబు ఇటీవలే సంతకం చేశారట. దీని లెక్కన సినిమాపై కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు.. తొలి వారం రోజుల్లో రికార్డు స్థాయి కలెక్షన్లు నమోదవుతాయి. ఇప్పటికే పవర్ స్టార్ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది.

 

ఇప్పటికే తెలంగాణ సర్కారు కూడా స్పెషల్ షోలకు అనుమతివ్వటంతో అజ్ఞాతవాసి టీమ్ తెల సంబరపడిపోతోంది. తాజా అనుమతుల ప్రకారం రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 10 గంటల వరకు స్పెషల్ షోలకు అనుమతి లభించింది. పండగ సీజన్ కావటంతో వసూళ్లు జోరుగా లభించే అవకాశాలున్నాయి. ఇప్పటికే నాన్ బాహుబలి ప్రి రిలీజ్ బిజినెస్ టాపర్ గా నిలిచింది పవన్ అజ్ఞాతవాసి.