పవర్ స్టార్ అజ్ఞాతవాసి మూవీకి మిక్స్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పవర్ స్టార్ స్టామినా ముందు మిక్స్ టాక్, నెగటివ్ రివ్యూలు నిలబడలలేకపోయాయి. ఏదో క్రేజ్ వున్నందుకే కలెక్షన్స్ వచ్చాయంటారా.. మీ ఇష్టం. లేక ఎక్కువ స్ర్కీన్లలో రిలీజ్ అయ్యిందంటారా ఓకే...  కాదు కాదు టిక్కెట్ రేట్లను పెంచారు కాబట్టే అంటారా మీ ఇష్టం వచ్చింది అనుకోండి, ఏమైనా చెప్పండి. పవర్ స్టార్ తన స్టామినా ఏంటో నిరూపిస్తూ అజ్ఞాతవాసి సినిమాను వసూళ్ల రికార్డులు సృష్టించేలా చేశాడు.

 

''అజ్ఞాతవాసి'' తొలిరోజు కలెక్షన్లను చూస్తే పవర్ స్టార్ స్టామినా పై పక్కా క్లారిటీ వస్తుంది. అమెరికాలో ప్రీమియర్ వసూళ్ళతో రికార్డు క్రియేట్ చేసిన అజ్ఞాతవాసి తెలుగు రాష్ట్రాల్లోనూ కలక్షన్లతో కుమ్మేశాడు. సినిమా రిజల్ట్ ని ఈ లెక్కల ద్వారా అంచనా వేసుకునే పనిలో పడ్డారు అభిమానులు.

 

ఏపీలో దాదాపు అన్ని సెంటర్స్ లో అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ షోలు మొదలు పెట్టడం - అధికారికంగానే ఏడు ఆటలకు అనుమతి లభించడంతో పాటు 200 రూపాయల దాకా టికెట్ అమ్ముకునే వెసులుబాటు కలిగించడం అజ్ఞాతవాసికి బాగా కలిసొచ్చింది.

 

ఫస్ట్ డే వరల్డ్ వైడ్ 60.5 కోట్ల గ్రాస్ తో పవర్ స్టార్ కొత్త రికార్డు సెట్ చేసాడు. నాన్ బాహుబలి సినిమాల్లో హయ్యస్ట్ రికార్డు తన పేరున రాసుకున్న పవన్.. బాహుబలి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన రెండో సినిమాగా మరో రికార్డు క్రియేట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా బాహుబలిని మినహాయించి మూడవ అతి పెద్ద ఓపెనర్ గా అజ్ఞాతవాసి అవతరించాడు.

 

బాహుబలి 2 - కబాలి – బాహుబలి1 తర్వాత సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా కూడా పవన్ మరో రికార్డు జత చేసాడు(బాక్స్ ఆఫీస్ వసూళ్ల మొత్తంతోపాటు డిస్ట్రిబ్యూటర్ల నుంచి అందిన సమాచారం మేరకు).

 

రేపు జైసింహ - సూర్య - 14న రంగుల రత్నం వస్తున్నాయి కాబట్టి వాటి ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ డే పరంగా మాత్రం పవన్ ఊహించినట్టే అధిక శాతం రికార్డులు కొట్టేసాడు. మరో ఐదు రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉన్న నేపథ్యంలో వసూళ్లు డ్రాప్ అవుతాయనుకోవటం సరికాదేమో.

ఇప్పటివరకు ఏరియాల వారిగా కలెక్షన్స్ ఇలా వున్నాయి(రిపోర్టులు రమారమి)