మరోసారి తండ్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్, లెజినోవా దంపతులకు మగబిడ్డ పసివాడిని ఒడిలో ఎత్తుకుని మురిసి పోతున్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాలతో ఎంత బిజీగా ఉంటున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న పవన్, ఆ తర్వాత ఆర్ టీ నీసన్ తోను ఓ సినిమా చేయనున్నాడు. పవన్ మరో సారి తండ్రి కాబోతున్నాడని గత కొంత కాలంగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్త నిజమైంది. పవన్ కళ్యాణ్ సతీమణి లెజినోవా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పసివాడిని ఒడిలో తీసుకుని పవన్ మురిసి పోతున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

రేణూ దేశాయ్ ని వివాహం చేసుకున్న పవన్ .. అకీరా, ఆద్య అనే ఇద్దరు చిన్నారులకి తండ్రి అయ్యాడు . ఆ తర్వాత రేణూతో విడాకులు తీసుకొని రష్యన్ లేడి అన్నా లెజీనావొని మూడో పెళ్ళి చేసుకున్నాడు పవన్. వీరికి పొలేనా అనే పాప ఉంది. అయితే రీసెంట్ గా అన్నా, పవన్ మరోసారి బిడ్డకు జన్మనివ్వటం టాలీవుడ్ సర్కిల్స్ లో నే కాక పవన్ ఫ్యాన్స్ ను కూడా సంతోషంలో ముంచెత్తుతోంది.