పవన్ పై రేణుదేశాయ్ కామెంట్స్.. అప్పుడలా... ఇప్పుడిలా..!

pawan fans fires on renudesai
Highlights

నేను ఉండగానే పవన్ మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకొని బిడ్డను కన్నాడని.. మీ ఇంట్లో అలా జరిగితే ఊరుకుంటారా అంటూ రేణు చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. పవన్ తో ఆమె విడిపోవడానికి అసలు కారణం ఇదేనని స్పష్టం చేసింది. అయితే పవన్ కు వ్యతిరేకంగా ఆమె ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అభిమానులు మరోసారి రేణుని టార్గెట్ చేశారు

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ మరో పెళ్లి చేసుకుంటుందని తెలిసిన తరువాత ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. దీంతో ఆమె తన ట్విట్టర్ అకౌంట్ నుండి తప్పుకుంది. తాజాగా పవన్ కు వ్యతిరేకంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. నేను ఉండగానే పవన్ మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకొని బిడ్డను కన్నాడని.. మీ ఇంట్లో అలా జరిగితే ఊరుకుంటారా అంటూ రేణు చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. పవన్ తో ఆమె విడిపోవడానికి అసలు కారణం ఇదేనని స్పష్టం చేసింది.

అయితే పవన్ కు వ్యతిరేకంగా ఆమె ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అభిమానులు మరోసారి రేణుని టార్గెట్ చేశారు. గతంలో ఆమె ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూను షేర్ చేస్తూ.. ఆ వీడియోలో రేణు మాట్లాడిన మాటలకు, తాజా ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలకు తేడా చూపిస్తున్నారు. గతంలో ఆమె.. 'పవన్ నాతో విడిపోయిన తరువాత అన్నా లెజ్నెవా ను పెళ్లి చేసుకొని తండ్రి అయ్యారని తెలుసుకొని ఆయనతో మాట్లాడను. ఆమెతో కూడా మాట్లాడి విషెస్ చెప్పాను.. ఇప్పటికీ పవన్ కు నాకు మధ్య మంచి స్నేహం ఉంది' అని చెప్పింది. ఆ వీడియోని ఇప్పుడు బయటకి తీసిన అభిమానులు రేణుదేశాయ్ తో ఎవరో కావాలనే బలవంతంగా పవన్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేయించారని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. 

అయితే రేణు మాత్రం ఇంటర్వ్యూలో తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కుటుంబం నీ తప్పు లేనప్పుడు నువ్వు ఈ విషయాలపై క్లారిటీ ఇస్తే బాగుంటుందని సూచించారని అందుకే మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. ఏది ఏమైనా.. రేణు ఒకే విషయంపై రెండు రకాల కామెంట్స్ చేయడం పట్ల మరోసారి  ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మరి ఈ విషయంపై పవన్ కామెంట్ చేస్తాడేమో చూడాలి!
 

loader