శ్రీరెడ్డి పవన్ ఫ్యాన్స్ కేసు నమోదు

సినీనటి శ్రీరెడ్డి అడ్డంగా బుక్కైంది. ఆమెపై పంజాగుట్ట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను దూషించినందుకు ఆయన అభిమాని శశాంక్‌ వంశీ.. నటిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన శ్రీరెడ్డి.. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్‌‌కు మహిళలంటే గౌరవముందా అంటూ తీవ్ర విమర్శలు చేసింది. ఆమె వ్యాఖ్యలపై పవన్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగిపోయింది. ఈ క్రమంలో అభిమానులు ఓ అడుగు ముందుకేసి ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.