గతేడాది పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌ల ముద్దుల కూతురు ఆద్య బర్త్ డే ను ఇద్దరు కలిసి నిర్వహించారు. ‘పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే నిజమైన బహుమతి బర్త్ డే రోజున వారితో టైమ్ స్పెండ్ చేయడమే’’ అని రేణు పేర్కొంటూ ఆద్యకు కేక్ తినిపిస్తున్న ఫోటోను గత ఏడాది సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈరోజు ఆద్య పుట్టినరోజు కావడంతో మళ్లీ ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఈ సంవత్సరం పవన్ రాజకీయాలలో బిజీగా ఉండటంతో వెళ్లలేకపోయాడు అని సమాచారం.