నేను నోరు తెరిస్తే రోడ్డు మీద పడతారు, అది నాకు ఇష్టం లేదు: పవన్

First Published 10, Jul 2018, 1:41 PM IST
Pawan Clarifies why he doesn't respond to Abusive women
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసి పూర్తిగా రాజకీయాల వైపు వచ్చేశారు. ప్రస్తుతం పవన్ దృష్టంతా 2019 ఎలక్షన్ల పైనే. పోరాట యాత్ర అంటు అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. వైజాగ్  యాత్రలోనే ఆయన తన సినిమాలు, కుటుంబసభ్యుల గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
 
పవన్ మాట్లాడుతూ.."నా దగ్గరకు చాలా మంది మహిళలు వచ్చి కలిశారు. అందరూ కలిసి జనసేన పార్టీ మహిళలకు ఏం చేయబోతోంది. మమల్ని సభలకు ఎందుకు రానివ్వట్లేదు అని అడిగితే. మీరు వద్దమ్మా అక్కడ జనం ఎక్కువ వస్తారు మీరు చాలా ఇబ్బంది పడతారు అని చెప్పాను. మహిళలు కోసం ఒక ఆత్మీయ సంభాషణ పెడదాం. ఒక సంసారాన్ని నడపాలంటే ఒక తల్లికి తెలుసు. నేను స్త్రీలకి ఎంత గౌరవమిస్తానో మా అక్కచెల్లెల్లకు తెలుసు. చాలా మంది నన్ను అవమానించినా కానీ, రకరకాలుగా బాధ పెట్టినా కానీ నేను గుండెల్లో పెట్టుకున్నా.. ఒక్కమాట కూడా మాట్లాడలేదు. నన్ను దెబ్బ కొట్టే వాళ్లను కూడా, నన్ను చీదరించుకున్నా.. ఎంత క్షోభకు గురిచేసినా వాళ్ల గురించి నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడనంటే, నేను మాట్లాడలేక కాదు, వాళ్ల గౌరవాన్ని రోడ్డు మీదకు లాగడం నాకు ఇష్టం లేదు. అందరి స్త్రీలకు అంత ఔన్నత్యం ఉండదు, కొంత మంది వేరుగా ఉంటారు. మనం వాళ్లని ఏం చేయలేం. నా పెద్ద కొడుకు నా మాట వింటాడు. నేను ఎవరికైతే అండగా నిలబడ్డానో వాళ్లకి నా భావజాలం అర్థం కాదు. నేను నా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాను. నేను అది కూడా చెప్తున్నాను" అంటూ పవన్ తన భాదను చెప్పుకొచ్చాడు.
 
loader