పవన్ కళ్యాణ్ మోసం చేశాడంటున్న డిస్ట్రిబ్యూటర్ సర్దార్ నష్టాన్ని కాటమరాయుడుతో పూడుస్తానని హామీ ఇచ్చాడంటున్న డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు పంపిణీ హక్కులు ఇవ్వకుండా దగా చేశాడని ఆరోపణలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని కృష్ణా జిల్లా కు కొని భారీ నష్టాన్ని చవి చూశానని అయితే ఆ సమయంలో మనం మరో సినిమా చేస్తున్నాం అందులో సర్దుబాటు చేద్దాం అని చెప్పి ఇప్పుడు కాటమ రాయుడు చిత్రాన్ని మాకు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు కృష్ణా జిల్లా పంపిణీదారుడు . గత ఏడాది రిలీజ్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే . దాంతో దాదాపుగా ఆ సినిమాని కొనుక్కున్న వాళ్ళు భారీ నష్టాలను చవిచూశారు . అయితే నష్టపోయిన వాళ్ళని ఆదుకుంటామని అప్పట్లో చెప్పారట శరత్ మరార్ కానీ ఇప్పుడేమో కాటమ రాయుడు చిత్రాన్ని ఇవ్వకుండా ఎక్కువ రేటుకి వేరే వాళ్లకు అమ్మి మమ్మల్ని మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ సినిమా ని కొనుక్కున్న వాళ్ళు.
అంతేనా శరత్ మరార్ లీగల్ గా మా తప్పు లేదు కావాలంటే ఒకసారి అగ్రిమెంట్ చదువుకో ఎక్కువగా చేస్తే సహించేది లేదు అంటూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారట . దాంతో కృష్ణా జిల్లా డిస్ట్రి బ్యూటర్ మీడియా ముందుకు వచ్చి గోడు వెళ్లబోసుకుంటున్నాడు . జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేస్తా అని అంటున్న పవన్ మాకు మాత్రం అన్యాయం చేస్తాడా ? అంటూ ప్రశ్నిస్తున్నాడు.
