- మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న సైరా నరసింహారెడ్డి
- స్టైలిష్ డైరెక్టర్ సురెందర్ రెడ్డి దర్శకత్వంలో సైరాను నిర్మిస్తున్న రామ్ చరణ్
- ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీ రోల్
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో టి.సుబ్బరామిరెడ్డి ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతుందని అంటున్న ఈ మూవీ ప్రకటించారు గానీ.. ఇప్పటివరకు దానికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ రాలేదు.
మరోవైపు ప్రస్థుతం రాజకీయాల్లో బిజీగా వున్న పవన్ కళ్యాణ్ కొంత కాలం సినిమాలకు బ్రేక్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో సుబ్బరామిరెడ్డి ప్రకటించిన మెగా బ్రదర్స్ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది ప్రస్థుతానికి సస్పెన్స్ గా మారింది.
అయితే మెగా క్యాంప్ నుంచి వస్తున్న తాజా సమాచారం మెగా అభిమానులకేకాక ప్రతి ఒక్కరికీ సంతోషం కలిగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరాలో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీ రోల్ లో నటించబోతున్నారని తెలుస్తోంది. అంతేకాక.. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్రలో కాక... మంచి నిడివి గల పాత్రలో నటిస్తారని తెలుస్తోంది.
మెగా అనుచరులు కూడా చిరు, పవన్ కలిసి నటిస్తే ఇద్దరి మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవనే అంశం జనాల్లోకి బాగా వెళ్తుంది కాబట్టి కన్విన్స్ చేసేందుకు ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాక ఇద్దరు అన్నదమ్ములు ఈ చిత్రంలో కనిపిస్తే... సినిమాకు మరింత వెయిట్ పెరుగుతుందని కూడా అంచనాలున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో నటిస్తారా లేదా అనేది వేచి చూడాలి.
Last Updated 25, Mar 2018, 11:39 PM IST