మెగా మూవీపై మౌనం వీడిన పవర్ స్టార్ తాజాగా ఖైదీ నంబర్ 150 యూనిట్ సభ్యులకు కంగ్రాట్స్ తెలిపిన పవన్ ఖైదీ నంబర్ 150 ప్రేక్షకులను అలరిస్తుందన్న పవన్ కళ్యాణ్
చరణ్, మా వదిన సురేఖగారి నిర్మాణంలో వస్తున్న తొలి చిత్రమే చిరంజీవి గారి 150వ చిత్రం కావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఖైదీ నంబర్ 150 ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ చిత్రంలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా మనః పూర్వక శుభాకాంక్షలు'. అంటూ ట్వీట్ చేశాడు.
అయితే ఈ ట్వీట్ లో సాయంత్రం జరగబోయే వేడుకకు తాను వచ్చేదీ రానిదీ క్లారిటీ ఇవ్వలేదు. శుక్రవారం సాయంత్రం నుంచి పవన్ ఖైదీ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరవుతాడన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. పవన్ స్వయంగా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారంటున్నారు అభిమానులు. పనవ్ మాత్రం తన ట్వీట్ లో ఎక్కడా వేడుకకు సంబంధించి స్పందించకపోవటంతో మరోసారి అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అసలు వస్తాడా.. రాడా.. తెలియాలంటే సాయంత్ర ఫంక్షన్ మొదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
అయితే పవన్ స్పందన చూస్తే మెగా ఫ్యామిలీ ప్రయత్నాలు ఫలించినట్టుగానే కనిపిస్తున్నాయి. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుక ప్రకటించిన దగ్గర నుంచి అభిమానులను వేదిస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికిందన్న ప్రచారం జరుగుతోంది. మెగా హీరోలందరూ ఓకె వేదిక కనిపించటం దాదాపు గా కన్ఫామ్ అయిపోయింది. ఇప్పటివరవకు సందిగ్థంలో ఉన్న పవన్ రాకపై కూడా క్లారిటీ వచ్చిదంటున్నారు ఫ్యాన్స్.
తన అన్న సినిమా వేడుకు పిలవకపోయినా వస్తానంటూ పవన్ సన్నిహితులతో చెప్పాడన్న వార్త అభిమానులను ఖుషీ చేస్తోంది. సర్థార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాగా.. ఇప్పుడు ఖైదీ నంబర్ 150 వేడుకకు పవన్ ప్రత్యేక అతిథిగా వస్తున్నాడు. ఈ సాయంత్రం గుంటూరు సమీపంలోని హాయ్ లాండ్ లో నిర్వహించనున్న ఈ వేడుకకు భారీగా ఏర్పాట్లు చేశారు.
