సహనానికి కూడా హద్దు ఉంటుంది: నాని

First Published 11, Jun 2018, 6:04 PM IST
Patience has a limit says hero nani
Highlights

నటి శ్రీరెడ్డి హీరో నానిపై ఆరోపణలు చేస్తూనే ఉంది. అతడితో తనకు శారీరక సంబంధం ఉందని

నటి శ్రీరెడ్డి హీరో నానిపై ఆరోపణలు చేస్తూనే ఉంది. అతడితో తనకు శారీరక సంబంధం ఉందని, కావాలనే శ్రీరెడ్డిని బిగ్ బాస్ హౌస్ లోకి రాకుండా అడ్డుకున్నాడని కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. గత కొంతకాలంగా ఆమె నానిపై విమర్శలు గుప్పిస్తూనే ఉంది. అయితే ఈ విషయాన్ని ఎన్నడూ కూడా నాని పట్టించుకొని రియాక్ట్ అవ్వలేదు. కానీ ఈసారి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు హద్దులు దాటాయి.

నానిని వ్యక్తిగతంగా దూషించడంతో పాటు ఫ్యామిలీ టాపిక్ కూడా తెచ్చింది. దీంతో నాని తన సహనాన్ని కోల్పోయి పరోక్షంగా ఆమెను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. పరువునష్టం దావా కింద తనపై ఆరోపణలు చేసిన వారిపై లీగల్ గా ప్రొసీడ్ అవ్వబోతున్నట్లు చెప్పాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒకరి పేరుని ప్రస్తావిస్తూ ఇష్టంవచ్చినట్లు మాట్లాడడం సబబు కాదని, సొసైటీలో చోటుచేసుకుంటోన్న ఇటువంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అందుకే లీగల్ గా ప్రొసీడ్ అవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఇక ఈ విషయంపై ఇంకెప్పుడు మరో మాట కూడా మాట్లాడనని స్పష్టం చేశాడు.  

 

loader