నన్ను కూడా కిడ్నాప్ చేశారు: ప్రముఖ నటి

parvathi menon about sexual harassment
Highlights

ఓ చర్చలో పాల్గొన్న పార్వతి.. తన సహ నటి కిడ్నాప్ కు గురైన విషయం తెలుసుకొని షాక్ అయ్యానని.. ఆమెకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని తెలిసి మరింత బాధ పడ్డానని వెల్లడించింది. ఆమెకు కూడా అటువంటి సంఘటన ఎదురైందని చెప్పి షాకింగ్ విషయాలను బయట పెట్టింది

మలయాళీ ముద్దుగుమ్మ పార్వతీమీనన్ కు అక్కడ మంచి క్రేజ్ ఉంది. 'బెంగుళూర్ డేస్' సినిమా ద్వారా ఆమె మరింత గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం రెండు,మూడు సినిమాలతో బిజీగా గడుపుతోంది. తాజాగా ఈ బ్యూటీ మలయాళీ సినీ సంఘం గురించిన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. దానికి ముందు నటుడు దిలీప్ ను సంఘంలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకించిన నటీమణులలో పార్వతి కూడా ఉన్నారు.

నటిపై అత్యాచార కేసులో విచారణలో ఉండగా.. నటుడు దిలీప్ ను సంఘంలో ఎలా చేర్చుకుంటారని పార్వతి ఖండించింది. ఈ విషయంపై ఓ చర్చలో పాల్గొన్న పార్వతి.. తన సహ నటి కిడ్నాప్ కు గురైన విషయం తెలుసుకొని షాక్ అయ్యానని.. ఆమెకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని తెలిసి మరింత బాధ పడ్డానని వెల్లడించింది. ఆమెకు కూడా అటువంటి సంఘటన ఎదురైందని చెప్పి షాకింగ్ విషయాలను బయట పెట్టింది. 

ఇప్పటికీ కుడా తనను ఎవరు కిడ్నాప్ చేశారో బయటపెట్టి శిక్ష పడేలా చేయగలనని కానీ అలా చేయడం తనకు ఇష్టం లేదని అన్నారు. వారు ఎంతకైనా తెగించే రకమని, తనకు ఇలా జరిగినా దాన్ని నుండి బయటపడగలిగినట్లు చెప్పారు. 

loader