పైసావసూల్ సినిమాలో భారీగా పంచ్ డైలాగులు పూరా తన మార్క్ డైలాగ్స్ తో తెరకెక్కించిన బాలయ్య పైసావసూల్ బాలయ్య డైలాగులకు విజిల్సే విజిల్స్..
నందమూరి బాలకృష్ణ - పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పైసా వసూల్ సినిమా భారీ అంచనాల మధ్య ఈ రోజు వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. వరుసగా ఫ్లాప్ సినిమాలు తీయటమే కాక, డ్రగ్స్ కేసులో సతమతమైన పూరి ఈ సినిమాను ఎలా డీల్ చేస్తాడా అని అంతా డౌట్ పడ్డారు. ఊహించినట్టే హీరోయిజన్ అంటే ఇదేరా అన్నట్లు చూపించే పూరీ పైసా వసూల్‌లో తన మార్క్ పంచ్ డైలాగ్స్ బాలయ్యతో చెప్పింది థియేటర్లలో విజిల్స్ వేయించాడు.
బాలయ్య చెప్పిన పంచ్ డైలాగ్స్ కొన్ని మీకోసం...
- మన బాడీకి రిప్లెక్షన్స్ ఎక్కువ. ఎవడు టచ్ చేయాలని చూసినా ముందే తెలిసిపోతుంది.
- నేను ఫాలోయింగ్ ఉన్న వాడిని... ఫాలో అయ్యేవాడిని కాదు.
- మర్యాదగా ఆ అమ్మాయిని వదిలేయండి...లేకపోతే చివరిసారిగా ఒకరిముఖాలు ఒకరు చూసుకోండి.
- మీరు భయపడితే నాకేం వస్తది బే...మీరు కలబడితే నాకు కిక్ వస్తది..
- మీరు నమ్ముకున్న దేవుడికి మొక్కుకోండి... ఈ క్షణం దాటితే గ్యారెంటీ ఉండదు..గ్యాప్ ఉండదు.
- నా గుండెల్లో కాల్చే హక్కు ఇద్దరికే ఇస్తా ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ..
- బీహార్‌లో తాగించినవాడిని తీహార్‌లో పోయించా తూ క్యారే అవులే..
- సింహానికి మేక ఎరేయాలనుకున్న మీ ఐడియా నాకు నచ్చింది... అయితే ఆ ప్లాన్‌ను మేకలన్నీ కలిపి చేయడమే ఫన్నీగా ఉంది.
- జేబులో చెయ్యిపెట్టు.. ఏమైనా తగిలిందా..
