Asianet News TeluguAsianet News Telugu

రాాజ్ పుత్ కత్తికెంత పదునుందో గాజుకూ అంతే వుంది-25న పద్మావత్

  • వివాదాల అనంతరం సెన్సార్ క్లియరెన్స్ పొందిన పద్మావతి చిత్రం
  • టైటిల్ పద్మావత్ గా మార్పు, మరికొన్ని సీన్స్ కట్
  • జనవరి 25న రిలీజ్ కు రెడీ అయిన పద్మావత్
PADMAVATH ALL SET TO RELEASE THIS JAN 25TH

బాలీవుడ్ దిగ్గజ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పద్మావతి ఆది నుంచే వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. పద్మావతి చిత్రం తమ ఆరాధ్య దైవం లాంటి రాజ్ పుత్ రాణి పద్మావతి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారని, ఈ చిత్రంలో పద్మావతి మహారాణిని తప్పుగా చూపించేందుకు దర్శకుడు భన్సాలీ ప్రయత్నిస్తున్నారని రాజ్ పుత్ కర్ణి సేన పెద్దయెత్తున ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో గత డిసెంబర్ మొదటి వారం విడుదల కావాల్సిన పద్మావతి చిత్రం ఇప్పటికీ రిలీజ్ కాలేదు. అయితే అనేక చర్చలు, సంప్రదింపుల అనంతరం కేంద్ర సర్కారు పద్మావతి చిత్రానికి సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వటంతో జనవరి 25న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు పద్మావతి రెడీ అయింది.

 

రాజ్ పుత్ వంశీయుల ఆందోళనల నేపథ్యంలో సెన్సార్ బోర్డు ఈ చిత్రంలో కొన్ని సీన్లకు కోతలు విధించింది. అంతేకాక సినిమాలోని కొన్ని సీన్స్ పైనే కాక టైటిల్స్ లాంటి ఇతర అంశాల్లోనూ మార్పులు చేయాలని బోర్డు దర్శక నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సినిమా పేరును కూడా 'పద్మావత్' గా మార్చారు. మార్పుల తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదల చేశారు. కొన్ని సీన్ల కత్తిరింపు తప్ప పెద్దగా మార్పులు ఏమీ లేకున్నా టైటిల్ మార్పు చేసి ‘పద్మావత్'గా మార్చారని తెలుస్తోంది.
 

ఆందోళనలు రేకెత్తడంతో సెన్సార్ బోర్డ్ అననుమతులిచ్చే అంశంపై చ‌రిత్ర‌కారుల స‌హాయం తీసుకుంది. వారి స‌ల‌హా మేర‌కు ఓ ఐదు మార్పుల‌ను సూచించింది. ఇది చారిత్రక సంబంధం లేని కల్పిత కథగా సినిమా ప్రారంభంలో ప్రకటించాలని, సినిమా పేరును పద్మావతి బదులు పద్మావత్‌గా మార్చాలని, సినిమాలోని ఘూమర్‌ పాటలో మార్పు చేయాలని, తప్పుగా చూపించిన చారిత్రక ప్రదేశాల చిత్రీకరణలను కూడా సరిచేయాలనే సెన్సార్ బోర్డు సూచనలకు దర్శక నిర్మాతలు అంగీకరించడంతో సెన్సార్ క్లియరెన్స్ వచ్చింది.

 

సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపిక పదుకోన్, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ ఈ చిత్రాన్ని 3డితో పాటు ఐమాక్స్ 3డి ఫార్మాట్లో విడుదల చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు సరికొత్త అనుభూతి పొందనున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇండియన్ సినిమాల్లో ఇదో గొప్ప చిత్రం అవుతుందని భావిస్తున్నారు.

 

రాణి పద్మావతి పాలిస్తున్న చిత్తోర్ గడ్ కోటను 1303 సంవత్సరంలో అల్లాఉద్దీన్ ఖిల్జీ ముట్టడించాడు. ఆ యుద్ధం ఎపిసోడ్ ను ప్రధానంగా ఫోకస్ చేస్తూ ‘పద్మావత్' చిత్రం సాగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో మహ్మదీయరాజు అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ పద్మావతి భర్త మహారావల్ రతన్ సింగ్ పాత్రలో నటిస్తున్నాడు. ‘పద్మావతి'గా టైటిల్ రోల్ చేస్తున్న దీపిక పదుకోన్ ఎంతో బ్యూటిఫుల్‌గా సినిమాలో కనిపించింది. ఆమె కెరీర్లో ఈ చిత్రం ది బెస్ట్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు. భన్సాలీ దర్శకత్వంలో రణవీర్ సింగ్, దీపిక పదుకోనె కలిసి నటించడం ఇది మూడో సారి. గతంలో రామ్-లీలా, బాజీరావు మస్తానీ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం ‘పద్మావత్' పై భారీ అంచనాలున్నాయి. ఎట్టకేలకు పద్మావత్ చిత్రం జనవరి 25న రిలీజ్ కానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios